
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 115


దసరా కానుక " సోలో బ్రతుకే సో బెటర్ "
రవితేజ "ఖిలాడి "?
నాకు ఎన్టీఆర్ ఇంకా చిన్నపిల్లోడే
'బిచ్చగాడు' సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది..!
"NBK 106 " లో బాలకృష్ణ సెకండ్ లుక్ ?

తమిళ హీరో సూర్య కు స్వల్ప గాయాలు
నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు..!
చిరంజీవి తీపి జ్ఞాపకం
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా

వర్మ పై బిగ్ బీ ప్రశంసలు... మొదటి చిత్రం ఇదే..!

ఎన్టీఆర్ జయంతికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నిర్ణయం

రాశీఖన్నా తమిళ భాష ప్రాక్టీస్

తన మూడు సినిమాలకు సీక్వెల్స్..?

త్వరలో SSMB 27 మూవీ అనౌన్స్ మెంట్

బర్త్ డే కి సర్ ప్రయిజ్ ఇవ్వనున్న బాలయ్య..!
సిక్స్ ప్యాక్ తో కార్తికేయ
హైదరాబాద్ లో కోల్ కతా సెట్

రష్యన్ ఛానల్ లో బాహుబలి 2
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. అంతేకాదు ఇక ఈసినిమా వచ్చిన అవార్డులకు లెక్కే లేదు ఎన్నో అవార్డులను దక్కించుకుంది.. ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు.

దసరా కానుక " సోలో బ్రతుకే సో బెటర్ "
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా " సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ ఫేమ్ నభా నటేష్ కథానాయిక. కోట శ్రీనివాసరావు , నాజర్, అజయ్, సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
రవితేజ "ఖిలాడి "?
కోనేరు సత్యనారాయణ నిర్మాతగా సక్సెస్ ఫుల్ "రాక్షసుడు" మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ కి "ఖిలాడి " టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. హీరో రవితేజ బాడీ లాంగ్వేజ్ కు ఈ టైటిల్ యాప్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తుంది.

కరోనా పై ప్రశాంత్ వర్మ సినిమా..ప్రీ లుక్ రిలీజ్..!
ఒకపక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే.. మరోపక్క ఈ వైరస్ పై సినిమాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 'కరోనా వైరస్' అంటూ సినిమా కూడా తీసి దాని ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా రానుంది. ‘అ’ అనే ఓ వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కరోనా పై సినిమా తెరకెక్కించనున్నాడు.
నాకు ఎన్టీఆర్ ఇంకా చిన్నపిల్లోడే
కొంతమంది వయసు పెరుగుతున్నా కూడా వాళ్లలో ఉండే అల్లరి తనం కానీ.. చిన్నపిల్లల లక్షణాలు కానీ పోవు. ఇక ఈ నేపథ్యంలో నాకు ఇప్పటికీ ఎన్టీఆర్ చిన్నపిల్లోడే అంటున్నాడు ఓ నటుడు. ఇంతకీ ఆ నటుడు ఎవరనుకుంటున్నారా...? ఎవరో కాదు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ కు, రాజీవ్ కనకాలకు మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టూడెంట్ నెం. 1 సినిమా నుండి వీరిద్దరి స్నేహం కొనసాగుతూనే వుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా తన సినిమాల్లో రాజీవ్‌ను దాదాపు ఉండేలా చూసుకుంటాడు జూనియర్. సినిమాల బంధం కంటే కూడా వ్యక్తిగతంగా వీరికి మంచి సాన్నిహిత్యం ఉంది.
'బిచ్చగాడు' సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది..!
విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ‘బిచ్చగాడు సినిమాతో ఈయన మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. తమిళంలో పిచ్చైకరన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేశారు. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిచ్చగాడు సినిమా మంచి వసూళ్లను సాధించింది. అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు మంచి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయనే వెల్లడించారు. “నాలుగు నెలల నుంచి సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాను. ప్రజంట్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజీలో ఉంది. త్వరలోనే…
"NBK 106 " లో బాలకృష్ణ సెకండ్ లుక్ ?
ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా "NBK 106 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఒకటి అఘోరా కాగా మరొక లుక్ ఫైనలైజ్ కావాల్సిఉంది. వారణాసి బ్యాక్ డ్రాప్ లో 40 రోజులు షూటింగ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా కారణం గా వారణాసి లో షూటింగ్ జరపడం కష్టం కనుక దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసినట్టు సమాచారం.

తమిళ హీరో సూర్య కు స్వల్ప గాయాలు
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన తమిళ స్టార్ హీరో సూర్య గాయాల పాలయినట్టు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. సూర్య వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలో ఎడమ చేతికి చిన్న గాయం అయిందని, అభిమానులు ఆందోళన చెంద వద్దని సూర్య సన్నిహితులు తెలిపారు.
నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు..!
సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ లు హ్యాక్ అవ్వడం చూస్తూనే ఉంటాం. ఇప్పటికే ప్రముఖ సెలబ్రిటీల సోషల్ మీడియా ఎకౌంట్లు హ్యాకింగ్‌కు గురవ్వడం చూసాం. చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ ఉంటారు హ్యాకర్లు. ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పూజ హెగ్డే. పూజా హెగ్డే ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా తానె తన ట్విట్టర్ వేదికగా తెలిపింది. 'నా అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.. కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోకండి..అలాగే ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో పంచుకోకండి' అంటూ…
చిరంజీవి తీపి జ్ఞాపకం
లెజెండరీ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేట్ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనతో తనకు ఉన్న తీపి జ్ఞాపకాన్ని మెగా స్టార్ చిరంజీవి ప్రేక్షకులతో పంచుకున్నారు. దర్శకుడు కె . రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన "తిరుగు లేని మనిషి " మూవీ లో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు. చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభం లో ఈ మూవీ రూపొందింది.
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా
ఈ రోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్ళొద్దని నిన్ననే నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఈ నేపథ్యంలో తన నివాసంలోనే తాతగారికి నివాళులు అర్పించుకున్నాడు ఎన్టీఆర్. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా తాతపై తనకున్న ప్రేమను చాటుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ కూడా చేశాడు. ‘నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.., మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది…, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా .. ‘ అని భావొద్వేగంతో పోస్ట్ ట్వీట్ చేసాడు.

వర్మ పై బిగ్ బీ ప్రశంసలు... మొదటి చిత్రం ఇదే..!
రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేట్ అన్న విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క లాక్ డౌన్ అని ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోయాయి.. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే ఇవ్వన్నీ రామ్ గోపాల్ వర్మకు మాత్రం మినహాయింపే అని చెప్పొచ్చు. కరోనా పై సినిమా తీస్తా అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ అలా చెప్పాడో లేదో సినిమా తీసి ట్రైలర్ కూడా రిలీజ్ చేసి షాకిచ్చాడు అందరికీ. నిన్న తన ట్విట్టర్ వేదికగా 'కరోనా వైరస్' ట్రైలర్ ను రిలీజ్ చేసాడు.

ఎన్టీఆర్ జయంతికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నిర్ణయం
లాక్ డౌన్ వల్ల అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీస్ కూడా తమ పుట్టినరోజులు, వేడుకలకు దూరంగా గా వుంటున్నారు. ఇక అభిమానులకు కూడా పుట్టినరోజు వేడుకలు చేయొద్దని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మరో నిర్ణయం తీసుకున్నారు.

రాశీఖన్నా తమిళ భాష ప్రాక్టీస్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల రాశీఖన్నా సక్సెస్ ఫుల్ తమిళ మూవీ "ఇమైక్క నోడిగళ్ "తో కోలీవుడ్ లో ప్రవేశించారు. రాశీఖన్నా నటించిన "అడంగమారు ", "అయోగ్య" మూవీస్ విజయం సాధించాయి. రాశీఖన్నా హీరోయిన్ గా రెండు తమిళ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి . మరో రెండు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. వాటిలో ఒకటి తమిళ సూపర్ స్టార్ హీరో గా రూపొందనున్న మూవీ ఒకటి.

తన మూడు సినిమాలకు సీక్వెల్స్..?
ఈ లాక్ డౌన్ వల్ల ఎక్కడి సినిమా షూటింగ్ లు అక్కడ ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే కొన్ని షరతులతో షూటింగ్ లకు అనుమతి ఇవ్వనున్నారు. జూన్ నుండి మొదలవనున్నాయి. ఇక ఈ లాక్ డౌన్ టైంను కొన్ని పనులు చేసుకోడానికి ఉపయోగించుకున్నారు కొంతమంది దర్శక నిర్మాతలు. కొంతమంది కొత్త కొత్త స్క్రిప్ట్స్ రాసుకుంటూ.. కొంత మంది అయినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్నారు.

అభిమానులకు స్పెషల్ ట్రీట్ "మాస్టర్ " - మాళవిక మోహనన్
XB క్రియేటర్స్ బ్యానర్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "మాస్టర్ " తమిళ మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. మాళవిక మోహనన్ కథానాయిక. విజయ్ సేతుపతి, అర్జున్ దాస్, ఆండ్రియా ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. "మాస్టర్ " మూవీ తమిళ భాషతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

త్వరలో SSMB 27 మూవీ అనౌన్స్ మెంట్
వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ తరువాత తాను నటించే మూవీ ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. సూపర్ హిట్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో SSMB 27 మూవీ రూపొందనుంది.

బర్త్ డే కి సర్ ప్రయిజ్ ఇవ్వనున్న బాలయ్య..!
తన పుట్టిన రోజుకు తన అభిమానులకు పెద్ద సర్ప్రైజే ప్లాన్ చేసాడు బాలకృష్ణ. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నారా..? ఒక పాటను రిలీజ్ చేయనున్నాడు. బాలకృష్ణ కొత్త సినిమాలో పాట అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటంటే.. ఎన్టీఆర్ జగదేకవీరుని కథ సినిమాలోని ''శివ శంకరి శివానందలహరి.. శివశంకరి'' పాట గుర్తుండే ఉంటది కదా. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు కంపోజ్ చేసిన ఈ పాటను లెజెండ్ ఘంటసాల పాడగా పింగళి నాగేంద్ర రావ్ రాసారు. ఇక ఈ పాటను ఇప్పటి సింగర్స్ పాడాలన్న చాలా కష్టం. ఆ పాట అలా ఉంటుంది మరి. అయితే ఇప్పుడు ఈ పాటను బాలయ్య పాడటానికి రెడీ అయ్యాడు. మ్యూజిషియన్ యాజమాన్య మ్యూజిక్…
సిక్స్ ప్యాక్ తో కార్తికేయ
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో ప్రేక్షకులలో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. కార్తికేయ హీరోగా నటించిన "హిప్పీ ", "గుణ 369", "90 ML మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేకపోయినా కార్తికేయ కే పై ఉన్న క్రేజ్ చెక్కు చెదరలేదు. కార్తికేయ ప్రస్తుతం ఒక మూవీ లో మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
హైదరాబాద్ లో కోల్ కతా సెట్
హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా " మూవీ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఫిక్షన్ &ఫాంటసీ మూవీ "శ్యామ్ సింగ రాయ్ "రూపొందనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీ లో హీరో నాని రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించనున్నట్టు సమాచారం. ఈ మూవీ లో నాని కి జోడీగా సాయి పల్లవి నటించే అవకాశం ఉంది.