ఈ లాక్ డౌన్ వల్ల ఎక్కడి సినిమా షూటింగ్ లు అక్కడ ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే కొన్ని షరతులతో షూటింగ్ లకు అనుమతి ఇవ్వనున్నారు. జూన్ నుండి మొదలవనున్నాయి. ఇక ఈ లాక్ డౌన్ టైంను కొన్ని పనులు చేసుకోడానికి ఉపయోగించుకున్నారు కొంతమంది దర్శక నిర్మాతలు. కొంతమంది కొత్త కొత్త స్క్రిప్ట్స్ రాసుకుంటూ.. కొంత మంది అయినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. తాను తీసిన మూడు సినిమాలకు సీక్వెల్స్ రెడీ చేసుకున్నాడట ఓ డైరెక్టర్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు కూల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఆ మూడు సినిమాలు.. విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ “రాఘవన్”, అలాగే నాగ చైతన్య మరియు సమంతలతో తెరకెక్కించిన అద్భుతమైన లవ్ స్టోరీ “ఏమాయ చేసావే”, అలాగే కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ నటించిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ జాన్రా చిత్రం “ఎంతవాడు గాని”.
ఈ మూడు సినిమాలకు గౌతమ్ మీనన్ ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నారట. అలాగే ఈ మూడింటినీ ఒక్కొక్క దాని తర్వాత మరొకటి వరుసగానే దర్శకత్వం వహించే యోచనలో ఉన్నారని వినిపిస్తుంది. చూద్దాం మరి ఇవి కేవలం వార్తలేనా.. నిజమేనా..? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: