కరోనా పై ప్రశాంత్ వర్మ సినిమా..ప్రీ లుక్ రిలీజ్..!

Awe Movie Director Prashant Varma To Release His New Movie Pre look Tomorrow,Telugu Filmngar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Prashant Varma,Prashant Varma Latest News,Prashant Varma New Movie News,Prashant Varma Next Project News,Prashant Varma Latest Film Updates

ఒకపక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే.. మరోపక్క ఈ వైరస్ పై సినిమాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ‘కరోనా వైరస్’ అంటూ సినిమా కూడా తీసి దాని ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా రానుంది. ‘అ’ అనే ఓ వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కరోనా పై సినిమా తెరకెక్కించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘అ!’ సినిమాతో విమర్శకుల మెప్పు పొందిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ…రెండో సినిమా రాజశేఖర్‌తో ‘కల్కి’ చిత్రం తెరకెక్కించారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే, ఇప్పుడు మూడో సినిమాతో రాబోతున్నారు ప్రశాంత్ వర్మ. అది కూడా కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ లుక్ ను ఈ రోజు తన ట్విట్టర్ లో రిలీజ్ చేసాడు.

ఇక ప్రీ లుక్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ పోస్టర్‌పై కరోనా వ్యాక్సిన్ అని రాశారు. ఇంజక్షన్ సిరంజిలో 10 శాతం లోడ్ చేశారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రాథమిక పరీక్ష చేయనున్నారట. అంటే రేపు ఉదయం 9 గంటలకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా టైటిల్ అదేనా ..? వేరే టైటిల్ ఏదైనా ఉందా..? ఇంకా పూర్తి వివరాలు చేయాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. మరి చూద్దాం కరోనా వ్యాక్సిన్ పై ప్రశాంత్ వర్మ తీసే ఆ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 9 =