లాక్ డౌన్ వల్ల అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీస్ కూడా తమ పుట్టినరోజులు, వేడుకలకు దూరంగా గా వుంటున్నారు. ఇక అభిమానులకు కూడా పుట్టినరోజు వేడుకలు చేయొద్దని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మరో నిర్ణయం తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రేపు (మే 28) దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి అన్న సంగతి తెలిసిందే. మరోవైపు, జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులందరూ హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి, నివాళి అర్పించడం ఆనవాయతీ. అయితే రేపు ఎన్టీఆర్ ఘాట్ ను జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ సందర్శించడం లేదు. ఇంటి వద్ద నుంచే తమ తాతగారికి వారు నివాళి అర్పించనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము ఘాట్ వద్దకు వస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారు రేపు ఘాట్ కు రాకూడదని నిర్ణయించుకున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























