‘బిచ్చగాడు’ సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది..!

We Are In The Final Stage Of Script Work Of Bicchagadu Movie Sequel Says Actor Vijay Antony
We Are In The Final Stage Of Script Work Of Bicchagadu Movie Sequel Says Actor Vijay Antony

విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ‘బిచ్చగాడు సినిమాతో ఈయన మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. తమిళంలో పిచ్చైకరన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేశారు. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిచ్చగాడు సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు మంచి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయ‌నే వెల్లడించారు. “నాలుగు నెలల నుంచి సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్​ రెడీ చేసే ప‌నిలో ఉన్నాను. ప్ర‌జంట్ స్క్రిప్ట్ ఫైన‌ల్ స్టేజీలో ఉంది​. త్వరలోనే న‌టీన‌టుల‌తో పాటు సాంకేతివర్గాన్ని వెల్లడిస్తా” అని విజయ్​ ఆంటోని తెలిపారు. ‘బిచ్చగాడు’ సినిమాకు దర్శకత్వం వహించిన శశి.. ప్రస్తుతం వేరే మూవీస్ తో బిజీగా ఉన్నారు. మ‌రి ఎవ‌రు ద‌ర్మ‌క‌త్వం వ‌హిస్తార‌నే విష‌యంపై క్లారిటీ రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోనీ. ఇటీవలే విజయ్ ఆంటోనీ, యాక్షన్ హీరో అర్జున్ తో కలిసి నటించిన కిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా తెలుగులో ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేదు. ప్రస్తుతం ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 19 =