టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల రాశీఖన్నా సక్సెస్ ఫుల్ తమిళ మూవీ “ఇమైక్క నోడిగళ్ “తో కోలీవుడ్ లో ప్రవేశించారు. రాశీఖన్నా నటించిన “అడంగమారు “, “అయోగ్య” మూవీస్ విజయం సాధించాయి. రాశీఖన్నా హీరోయిన్ గా రెండు తమిళ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి . మరో రెండు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. వాటిలో ఒకటి తమిళ సూపర్ స్టార్ హీరో గా రూపొందనున్న మూవీ ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టూడియో గ్రీన్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హరి దర్శకత్వంలో సూర్య హీరోగా “అరువా ” తమిళ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో రాశీఖన్నా హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. దర్శకుడు హరి , హీరో సూర్య కాంబినేషన్ లో 6వ మూవీ గా రూపొందనున్న “అరువా “మూవీ సూర్య 39వ మూవీ గా రూపొందనుంది. తెలుగు లో అనర్గళం గా మాట్లాడే రాశీఖన్నా తమిళ భాష ను కొంచం అర్ధం చేసుకోగలరు. ఇప్పుడు తమిళ భాష పై పట్టు కై ఒక టీచర్ ద్వారా రాశీఖన్నా ఆ భాష ను నేర్చుకుంటున్నారు. లాక్ డౌన్ సమయాన్ని ఈ విధంగా సద్వినియోగపరచుకుంటున్నానని రాశీఖన్నా తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: