వర్మ పై బిగ్ బీ ప్రశంసలు… మొదటి చిత్రం ఇదే..!

Bollywood Veteran Actor Amitabh Bachan Applauds Ram Gopal Varma For Making A Movie On Corona Virus
Bollywood Veteran Actor Amitabh Bachan Applauds Ram Gopal Varma For Making A Movie On Corona Virus

రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేట్ అన్న విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క లాక్ డౌన్ అని ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోయాయి.. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే ఇవ్వన్నీ రామ్ గోపాల్ వర్మకు మాత్రం మినహాయింపే అని చెప్పొచ్చు. కరోనా పై సినిమా తీస్తా అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ అలా చెప్పాడో లేదో సినిమా తీసి ట్రైలర్ కూడా రిలీజ్ చేసి షాకిచ్చాడు అందరికీ. నిన్న తన ట్విట్టర్ వేదికగా ‘కరోనా వైరస్’ ట్రైలర్ ను రిలీజ్ చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్రైలర్ ను చూసిన బిగ్ బీ వర్మపై ప్రశంసలు కురిపించాడు. ‘కరోనా వైరస్‌’ ట్రైలర్‌ను తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఎక్కడ తగ్గని సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అందరికి ‘రాము’ కానీ.. నాకు మాత్రం సర్కార్‌. లాక్‌డౌన్‌ సమయంలో ఓ కుటుంబం ఎదుర్కొనే వివిధ పరిస్థితులపై.. లాక్‌డౌన్‌లోనే సినిమాను రూపొందించి సహజత్వాన్ని చూపించిన ఘనత ఆర్జీవీది. టైటిల్ సినిమా : కరోనా వైరస్‌.. బహుశా వైరస్‌పై మొట్టమొదటిసారిగా వచ్చిన సినిమా ఇది..అంటూ ట్రైలర్‌ను పంచుకున్నారు.

కాగా, రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ అయ్యంగర్‌, తదితరులు నటించారు. ఈ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించగా, డీఎస్సార్‌ సంగీతమందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.