రష్యన్ ఛానల్ లో బాహుబలి 2

SS Rajamouli Magnam Opus Baahubali 2 Aired On A Russian TV Channel With Subtitles

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. అంతేకాదు ఇక ఈసినిమా వచ్చిన అవార్డులకు లెక్కే లేదు ఎన్నో అవార్డులను దక్కించుకుంది.. ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే లండన్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘బాహుబలి 1 సినిమాను ప్రదర్శించారు. 148 ఏళ్ల ఆల్బర్ట్‌ హాల్‌ చరిత్రలో ఇంగ్లీష్‌ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శించారంటే ఆ ఘనత బాహుబలికి దక్కింది. ఇప్పుడు మరో రికార్డు ను సొంతం చేసుకుంది. రష్యన్ ఛానల్ లో బాహుబలి2 ను ప్రదర్శించారు. రష్యన్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమాను టెలికాస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రష్యన్ ఎంబసీ ఆఫ్ ఇండియా తమ అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది.


మరి మన తెలుగు సినిమా రాష్ట్రాలు, దేశాలు దాటి మరి ఇంత గుర్తింపు తెచుకుందంటే గొప్ప విషయమే కదా. ముందు ముందు కూడా మన తెలుగు సినిమాలు ఇలాంటి ఖ్యాతిని దక్కించుకోవాలని కోరుకుందాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here