నాకు ఎన్టీఆర్ ఇంకా చిన్నపిల్లోడే

Jr NTR Is Still A Kid For Me Says Actor Rajeev Kanakala
Jr NTR Is Still A Kid For Me Says Actor Rajeev Kanakala

కొంతమంది వయసు పెరుగుతున్నా కూడా వాళ్లలో ఉండే అల్లరి తనం కానీ.. చిన్నపిల్లల లక్షణాలు కానీ పోవు. ఇక ఈ నేపథ్యంలో నాకు ఇప్పటికీ ఎన్టీఆర్ చిన్నపిల్లోడే అంటున్నాడు ఓ నటుడు. ఇంతకీ ఆ నటుడు ఎవరనుకుంటున్నారా…? ఎవరో కాదు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ కు, రాజీవ్ కనకాలకు మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టూడెంట్ నెం. 1 సినిమా నుండి వీరిద్దరి స్నేహం కొనసాగుతూనే వుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా తన సినిమాల్లో రాజీవ్‌ను దాదాపు ఉండేలా చూసుకుంటాడు జూనియర్. సినిమాల బంధం కంటే కూడా వ్యక్తిగతంగా వీరికి మంచి సాన్నిహిత్యం ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తాను నటించిన సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాజీవ్ కనకాలతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు రాజీవ్. తన ఫోన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్‌ని కిడ్ అని సేవ్ ఉంటుందట. అంతే కాదు ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే రోజు విషెస్ పంపిస్తూ ఉంటాడని తెలిపాడు ఎన్టీఆర్. ఈ సందేశాలు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పంపిస్తున్నాడని.. తనకి ఇద్దరు పిల్లలున్నా కూడా రాజీవ్ కనకాల మాత్రం తనని ఇంకా చిన్న పిల్లాడే అనుకుంటున్నాడని సరదాగా చెప్పుకొచ్చాడు యంగ్ టైగర్.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + four =