బర్త్ డే కి సర్ ప్రయిజ్ ఇవ్వనున్న బాలయ్య..!

Tollywood Actor Nandamuri Balakrishna Plans A Special Surprise To His Fans On His Birthday
Tollywood Actor Nandamuri Balakrishna Plans A Special Surprise To His Fans On His Birthday

తన పుట్టిన రోజుకు తన అభిమానులకు పెద్ద సర్ప్రైజే ప్లాన్ చేసాడు బాలకృష్ణ. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నారా..? ఒక పాటను రిలీజ్ చేయనున్నాడు. బాలకృష్ణ కొత్త సినిమాలో పాట అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటంటే.. ఎన్టీఆర్ జగదేకవీరుని కథ సినిమాలోని ”శివ శంకరి శివానందలహరి.. శివశంకరి” పాట గుర్తుండే ఉంటది కదా. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు కంపోజ్ చేసిన ఈ పాటను లెజెండ్ ఘంటసాల పాడగా పింగళి నాగేంద్ర రావ్ రాసారు. ఇక ఈ పాటను ఇప్పటి సింగర్స్ పాడాలన్న చాలా కష్టం. ఆ పాట అలా ఉంటుంది మరి. అయితే ఇప్పుడు ఈ పాటను బాలయ్య పాడటానికి రెడీ అయ్యాడు. మ్యూజిషియన్ యాజమాన్య మ్యూజిక్ అందిస్తుండగా సింగర్ స్మిత బాలయ్యకు పాడటంలో సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పాటను బాలకృష్ణ పుట్టినరోజు పండుగ నాడు అంటే జూన్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నాడట. చూద్దాం మరి ఎలా ఉంటుందో… బాలకృష్ణ ఎలా పాడతాడో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర చేయనున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.