ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా

Jr NTR Gets Emotional About His Grand Father Sr NTR

ఈ రోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్ళొద్దని నిన్ననే నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఈ నేపథ్యంలో తన నివాసంలోనే తాతగారికి నివాళులు అర్పించుకున్నాడు ఎన్టీఆర్. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా తాతపై తనకున్న ప్రేమను చాటుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ కూడా చేశాడు. ‘నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.., మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది…, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా .. ‘ అని భావొద్వేగంతో పోస్ట్ ట్వీట్ చేసాడు.

ఇక ఇదిలా ఉండగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ సందర్శించారు. భార్య వసుంధర దేవితో పాటు ఘాట్ చేరుకున్న ఆయన తండ్రి సమాధి పై పుష్పాలు ఉంచి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద బాలయ్య కొద్ది నిముషాలు వున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here