తమిళ హీరో సూర్య కు స్వల్ప గాయాలు

Tamil Star Hero Suriya Sustains Minor Injuries During His Workout Session At His Home

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన తమిళ స్టార్ హీరో సూర్య గాయాల పాలయినట్టు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. సూర్య వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలో ఎడమ చేతికి చిన్న గాయం అయిందని, అభిమానులు ఆందోళన చెంద వద్దని సూర్య సన్నిహితులు తెలిపారు.

హీరో సూర్య ప్రస్తుతం సుధకొంగర దర్శకత్వంలో రూపొందుతున్న “సూరారై పోట్రు” (ఆకాశం నీ హద్దురా ) మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత “సింగం ” మూవీ ఫేమ్ హరి దర్శకత్వంలో “అరువా “మూవీ కి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాశీఖన్నా కథానాయిక. లాక్ డౌన్ తరువాత “అరువా “మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ దర్శకుడు హరి , హీరో సూర్య కాంబినేషన్ లో 6వ మూవీ గా రూపొందనుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here