ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 45

భీష్మ నుండి రాబోతున్న ఫస్ట్ గ్లింప్స్

మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రకుల్
ప్రేమికుల రోజున 96 మూవీ తెలుగు రీమేక్ రిలీజ్ ?
అజిత్ కోసమా..? పవన్ కోసమా..?
డిసెంబర్ 25న రానున్న ‘వెంకీమామ’?
ఫైటర్ మూవీ సంగీత దర్శకుడు మణిశర్మ
సేఫ్ జోన్ లో 'విజిల్' నిర్మాతలు
హీరో విశాల్ డిటెక్టివ్ 2 మూవీ ప్రారంభం
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ?
ప్రభాస్‌తో మరోసారి జట్టుకట్టనున్న ‘దిల్’ రాజు?
వాస్తవ ఘటనల ఆధారంగా చిరు, కొరటాల మూవీ?
ఆసక్తికరమైన కథాంశంతో నితిన్, యేలేటి చిత్రం?
కీర్తి సురేష్ 'పెంగ్విన్' షూటింగ్ పూర్తి
'ప్రతిరోజూ పండగే'నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్
వర్మ - కే.ఏ పాల్ మధ్యలో రాజమౌళి
నిశ్శబ్దం టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు లో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. దీపావళి సందర్భంగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు.

భీష్మ నుండి రాబోతున్న ఫస్ట్ గ్లింప్స్
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ వీడియో రిలీజ్ చేయనున్నారు.

మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రకుల్
మొత్తానికి ఇటు తెలుగు, అటు తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీ అయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ మధ్య కాస్త వెనుక పడినా ఇప్పుడు మాత్రం తన కెరీర్ పై దృష్టి పెట్టి పలు కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టింది. ప్రస్తుతం హిందీలో ఆమె చేసిన ‘మర్జవాన్’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాపైనే ఇప్పుడు రకుల్ హోప్స్ అన్నీ.
ప్రేమికుల రోజున 96 మూవీ తెలుగు రీమేక్ రిలీజ్ ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూపర్ హిట్ 96 తమిళ మూవీ తెలుగు రీమేక్ హృద్యమైన ప్రేమకథ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. ప్రేమ్ కుమార్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 తమిళ మూవీ 2018 సంవత్సరంలో అక్టోబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. తెలుగు నేటివిటీ కి సరిపోయేలా స్క్రిప్ట్ లో దర్శకుడు మార్పులు చేశారు.
అజిత్ కోసమా..? పవన్ కోసమా..?
ఇప్పటికే పింక్ రీమేక్ ను పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది రెండు రోజుల క్రితం. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు తో పాటు బోనీ కపూర్ కూడా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. బోనీ కపూర్ ఇప్పటీకే ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అజిత్ హీరోగా ‘నెర్కొండ పారవై’ అనే పేరుతో అక్కడ రీమేక్ చేసారు. ఇక ఆ సినిమా అక్కడ హిట్ కొట్టడంతో మళ్ళీ అదే కాంబినేషన్ లో ‘వలిమై’ అనే సినిమాను కూడా చేస్తున్నారు.
బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో పూజ హెగ్డే ?
బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్ నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈమూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రెడీ చేయడం లో బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
డిసెంబర్ 25న రానున్న ‘వెంకీమామ’?
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ... ఇందులోనూ అవే పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించాడు.
ఫైటర్ మూవీ సంగీత దర్శకుడు మణిశర్మ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫైటర్ మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఫైటర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్ , ఫైటర్ మూవీ కి సంగీత దర్శకుడిగా మణిశర్మ ను ఎంపిక చేశారు.
సేఫ్ జోన్ లో 'విజిల్' నిర్మాతలు
అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటీకే ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మొదటి వారానికి 8.93 షేర్ ను రాబట్టింది. ఇక పది రోజులకు గాను 10.09 కోట్లు రాబట్టింది. దీనితో ఈ సినిమా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి మొదటివారం ముగిసేసరికి ఈ సినిమా ఏయే ఏరియాలో ఎంత రాబట్టిందో చూద్దాం.
హీరో విశాల్ డిటెక్టివ్ 2 మూవీ ప్రారంభం
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన తుప్పరివాలన్ తమిళ మూవీ 2017 సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ డిటెక్టివ్ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు డిటెక్టివ్ మూవీ సీక్వెల్ డిటెక్టివ్ 2 మూవీ రూపొందుతుంది.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ?
మాస్ మహారాజా రవితేజ... ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘డిస్కోరాజా’(డిసెంబర్ 20న విడుదల) కాగా... మరొకటి గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే... తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రవితేజ.
ప్రభాస్‌తో మరోసారి జట్టుకట్టనున్న ‘దిల్’ రాజు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కలిసొచ్చిన నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. గతంలో ఈ ఇద్దరి కలయికలో ‘మున్నా(2007), ‘మిస్టర్ పర్ ఫెక్ట్’(2011) వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. కాగా... త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని సమాచారం.
వాస్తవ ఘటనల ఆధారంగా చిరు, కొరటాల మూవీ?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే పూజ జరుపుకున్న ఈ సినిమా... డిసెంబర్ తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అంతేకాదు... ప్రస్తుతం కోకాపేట్‌లో ఓ కాలనీ సెట్ వేస్తున్నారని, అక్కడే పాటతో చిత్రీకరణకు శ్రీకారం చుడతారని టాక్.
ఆసక్తికరమైన కథాంశంతో నితిన్, యేలేటి చిత్రం?
యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `చదరంగం`, `ఏ 1` అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే... ఈ సినిమా స్టోరీలైన్‌పై ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో కే ఏ పాల్ బయోగ్రఫీ - రాంగోపాల్ వర్మ
జనాల్ని గెలకటంలో రాంగోపాల్ వర్మ స్టైలే వేరు. ' కాదేదీ కవితకనర్హం' అన్నట్లు' కారెవరూ వర్మ వెటకారానికి అతీతం'. ప్రపంచ ప్రఖ్యాత శాంతిదూతను, సమస్త దేశాధినేతల సన్నిహిత మిత్రుడిని అని చెప్పుకునే క్రైస్తవ మత ప్రచారకుడు కే ఏ పాల్ మీద రామ్ గోపాల్ వర్మ వదిలిన వ్యంగాస్త్రాన్ని ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కీర్తి సురేష్ 'పెంగ్విన్' షూటింగ్ పూర్తి
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'పెంగ్విన్' అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఉమెన్ సెంట్రిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
'ప్రతిరోజూ పండగే'నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్
మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరో ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. తాత .. మనవడి అనుబంధం నేపథ్యంలో సాగే గ్రామీణ కథలో మనవడిగా సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.ఈ నెల 4వ తేదీ అంటే సోమవారం ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.

మోడీ విందుపై బాలు విమర్శలు - మా ఫోన్లు తీసేసుకున్నారు..!
మహాత్మ గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని సినీ, టీవీ రంగాలకు చెందిన వారు ప్రధాన మంత్రి విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమంపై పలు విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మొదట ఈ విషయంపై మెగా కోడలు ఉపాసన స్పందించి దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదని.... దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష..సౌత్‌పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించింది. అంతేకాదు కుష్బూ కూడా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. దేశానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. ఇక్కడి వాళ్లను కూడా కాస్త గుర్తు పెట్టుకొండి అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
'ఆవిరి', 'మీకు మాత్రమే చెప్తా' లేటెస్ట్ కలెక్షన్స్
ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా థియేటర్లో సందడి చేస్తూనే ఉంటుంది. అలానే నిన్న కూడా రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రవిబాబు నటుడిగా స్వీయదర్శకత్వంలో వచ్చిన 'ఆవిరి'.. షమ్మిర్ దర్శకత్వంలో విజయ దేవరకొండ సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కిన 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమాలు నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలకు మంచి టాక్ నే సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
వర్మ - కే.ఏ పాల్ మధ్యలో రాజమౌళి
రామ్ గోపాల్ దర్శకత్వంలో వస్తున్న 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుండి ఈ రోజు ఉదయాన్నే కేఏ పాల్ గురించి ఒక సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘నేనే…కె ఏ పాల్…చూపిస్తా కమాల్…, అంటూ వచ్చే పాటను రిలీజ్ చేశాడు వర్మ. అయితే అక్కడితో ఆగితే వర్మ ఎందుకు అవుతాడు.. మరో ట్వీట్ చేసాడు. "కేఏ పాల్ జీవితం మీద జోకర్ అనే బయోపిక్ తీస్తే బాహుబలి-3 కంటే పెద్ద హిట్టవుతుంది. రాజమౌళి ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో కేఏ పాల్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. కేఏ పాలే నాకీ విషయం చెప్పాడు" అంటూ వర్మ ఓ ట్వీట్ చేశాడు.