విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ… ఇందులోనూ అవే పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ‘వెంకీమామ’ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: