యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `చదరంగం`, `ఏ 1` అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమా స్టోరీలైన్‌పై ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… చెస్ ప్లేయర్ అయిన హీరో, చదరంగంలో తన దేశాన్ని నెంబర్ వన్‌గా నిలపడం కోసం నిరంతరం తపిస్తూ ఉంటాడట. అయితే, కొన్ని అనూహ్య ఘటనల కారణంగా కథానాయకుడికి ఉరిశిక్ష పడుతుందట. ఇలాంటి పరిస్థితుల్లోనూ చెస్ కాంపిటీషన్స్‌లో పాల్గొని, చదరంగంలో తన దేశాన్ని నెంబర్ వన్‌గా నిలపడంతో… హీరోకి పడ్డ ఉరి శిక్షను ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుందట. మరి… ఈ కథనంలో నిజమెంతో తెలియాలంటే విడుదల వరకు వేచిచూడాల్సిందే.
రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ నాయికలుగా నటిస్తున్న ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: