రాజమౌళి దర్శకత్వంలో కే ఏ పాల్ బయోగ్రఫీ – రాంగోపాల్ వర్మ

RGV Makes Fun of Rajamouli

జనాల్ని గెలకటంలో రాంగోపాల్ వర్మ స్టైలే వేరు. ‘ కాదేదీ కవితకనర్హం’ అన్నట్లు’ కారెవరూ వర్మ వెటకారానికి అతీతం’. ప్రపంచ ప్రఖ్యాత శాంతిదూతను, సమస్త దేశాధినేతల సన్నిహిత మిత్రుడిని అని చెప్పుకునే క్రైస్తవ మత ప్రచారకుడు కే ఏ పాల్ మీద రామ్ గోపాల్ వర్మ వదిలిన వ్యంగాస్త్రాన్ని ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసారి రాంగోపాల్ వర్మ తన వ్యంగ్య , వెటకార చమత్కారంలో అన్నెం పున్నెం ఎరుగని దర్శక ప్రముఖుడు రాజమౌళిని ఇన్వాల్వ్ చేయటం హైలైట్ అయింది.

ఇంతకూ తన ట్విట్టర్ ద్వారా రామ్ గోపాల్ వర్మ వదిలిన కాకినాడ తాజా కాజా లాంటి కొంటె కోణంగి వ్యంగాస్త్రం ఏమిటంటే- ” భారతదేశంలో “జోకర్ ” అంత పెద్ద హిట్ అయింది అంటే కే ఏ పాల్ బయోగ్రఫీని సినిమాగా తీస్తే అది బాహుబలి -2 కంటే సూపర్ హిట్ అవుతుంది. ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి లో ఉన్న నేను ఈ విషయమై దర్శకుడు రాజమౌళితో చర్చిస్తున్నాను “- అని స్వయంగా
కే. ఏ. పాల్ తనకు ఫోన్ చేసి చెప్పాడు- అనిట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ.

క్షణాల్లో వైరల్ అయిన ఈ ట్వీట్ ను చూసిన దర్శకుడు రాజమౌళి తనదైన శైలిలో రాంగోపాల్ వర్మకు రిప్లై ఇస్తూ “నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి ‘ రాజు’ గారు” -అంటూ పక్కనే ఒక రన్నింగ్ అవే ఫిగర్ ను పోస్ట్ చేశారు.

ఇవాల్టికి రాంగోపాల్ వర్మ నుండి వచ్చిన ఈ ట్వీట్ ను నెటిజన్లు మంచి స్వీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ ట్వీట్ తో ఈరోజు రాంగోపాల్ వర్మ హాఫ్ బాటిల్ ఓడ్కా కొట్టినంత కిక్కును ఎంజాయ్ చేస్తుంటారు. రేపో ఎల్లుండో మరో వెటకార బాణంతో వర్మ ఎవర్నో ఒకర్ని గెలికేదాకా చూస్తూనే ఉండండి. the twitter account of ‘Ram Gopal Varma ‘the The Everest of ‘Vetakaaram’.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =