‘ప్రతిరోజూ పండగే’నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్

Pratiroju Pandaage First Single To Be Out Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pratiroju Pandaage Movie Updates,Pratiroju Pandaage Telugu Movie Latest News,Pratiroju Pandaage Songs,Pratiroju Pandaage Movie Songs,Pratiroju Pandaage Telugu Movie Songs

మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరో ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. తాత .. మనవడి అనుబంధం నేపథ్యంలో సాగే గ్రామీణ కథలో మనవడిగా సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌, ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.ఈ నెల 4వ తేదీ అంటే సోమవారం ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో సాయి తేజ్ హీరో సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా… రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్యశ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా.. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + ten =