మహాత్మ గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని సినీ, టీవీ రంగాలకు చెందిన వారు ప్రధాన మంత్రి విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమంపై పలు విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మొదట ఈ విషయంపై మెగా కోడలు ఉపాసన స్పందించి దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదని…. దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష..సౌత్‌పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించింది. అంతేకాదు కుష్బూ కూడా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. దేశానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. ఇక్కడి వాళ్లను కూడా కాస్త గుర్తు పెట్టుకొండి అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఉపాసన ట్వీట్ కు ఎఫక్ట్ తో చిరు-చరణ్ లకు మోడీ నుండి ఆహ్వానం అందినట్టు.. త్వరలోనే చిరు చరణ్ మోడీని కలవడానికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి దీనిపై స్పందించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అక్కడ జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నారు. అసలు సంగతేంటంటే.. ఈ కార్యక్రమానికి బాలు కూడా వెళ్లడం జరిగిందట. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత మా దగ్గర నుండి మొబైల్ ఫోన్ లను తీసుకున్నారు.. దానికి మాకు ఒక టోకెన్ కూడా ఇచ్చారు… అయితే ఆశ్చర్యం ఏంటంటే.. లోపలి వెళ్లి చూస్తే అక్కడ కొంత మంది సెలబ్రిటీస్ మాత్రం మోడీతో ఫొటోస్ తీసుకుంటూ కనిపించారు.. మొత్తానికి ఏదో జరుగుతుంది అని అర్థమైంది అని చెప్పారు. మరి ఫొటోస్ తీసుకున్న ఆ సెలెబ్రిటీస్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా..? చూడబోతే ఈ వ్యవహారం చాలా దూరమే వెళ్లేట్టు కనిపిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: