నిశ్శబ్దం టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Nishabdham Mania Starts,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nishabdham Movie Updates,Nishabdham Telugu Movie Latest News,Nishabdham Movie Teaser Release Date,Nishabdham Telugu Movie Teaser Release Date Locked,Nishabdham Movie Teaser Release Date Confirmed

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు లో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. దీపావళి సందర్భంగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమా టీజర్ ను నవంబర్ 7వ తేదీన రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. కానీ మళ్ళీ డేట్ మార్చి ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. రేపు (నవంబర్ 6) సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 4 =