శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూపర్ హిట్ 96 తమిళ మూవీ తెలుగు రీమేక్ హృద్యమైన ప్రేమకథ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. ప్రేమ్ కుమార్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 తమిళ మూవీ 2018 సంవత్సరంలో అక్టోబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. తెలుగు నేటివిటీ కి సరిపోయేలా స్క్రిప్ట్ లో దర్శకుడు మార్పులు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ప్రేమ జంట విడిపోయి కొన్ని సంవత్సరాల తరువాత కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొనే కాన్సెప్ట్ తో ఒక భావోద్వేగ ప్రేమ కథ గా రూపొందింది. గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్నుజరుపుకొంటుంది. దిల్ రాజు నిర్మాతగా ప్రొడక్షన్ నెం 34 గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ ను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుందని సమాచారం. అద్భుతమైన ప్రేమ కథ గా రూపొందిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: