
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 46

ఫైటర్ మూవీ లో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్
ఫైట్ చిత్రీకరణలో అల .. వైకుంఠపురములో .. మూవీ
రజనీకాంత్ 168 మూవీ టైటిల్ "వియోగం "
పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కన్ఫామ్
ఖైదీ మూవీ టీమ్ కు మహేష్ బాబు అభినందనలు
ప్రభాస్ సినిమాను నిర్మించనున్న రామ్ చరణ్..!
యాక్షన్ తెలుగు ట్రైలర్ రిలీజ్

శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని

ఉపాసన ట్వీట్ ఎఫెక్ట్ - చిరు,చరణ్ కు మోడీ ఆహ్వానం
భీష్మ మూవీ లో నితిన్ కామెడీ స్కిల్స్
మరో చారిత్రాత్మక మూవీ లో దీపికా పడుకొనే
రంగస్థలం మూవీ తమిళ రీమేక్ లో హీరో
చిత్తూరు మాండలీకం లో అల్లు అర్జున్ డైలాగ్స్

'జెర్సీ' హిందీ రీమేక్ - షాహిద్ ప్రాక్టీస్ షురూ

50కోట్ల క్లబ్ లో ఖైదీ మూవీ
దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా సాంగ్స్, హీరోయిన్, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా నైట్ ఎఫెక్ట్ లో ప్రయోగాత్మకం గా రూపొందిన ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రి లీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించింది. వసూళ్ళ పరం గా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ మూవీ ని సత్య సాయి ఆర్ట్స్ రాధామోహన్ రిలీజ్ చేశారు.
ఫైటర్ మూవీ లో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్
సక్సెస్ ఫుల్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం లో సపోర్టింగ్ రోల్ లో నటించిన విజయ్ దేవరకొండ సూపర్ హిట్ మూవీ పెళ్ళిచూపులు తో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ అర్జునరెడ్డి మూవీ తో సెన్సేషనల్ హీరోగా మారి బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీతో స్టార్ హీరోగా ఎదిగారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
ఫైట్ చిత్రీకరణలో అల .. వైకుంఠపురములో .. మూవీ
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. టబు, నివేత పేతురాజ్ , సుశాంత్, నవదీప్, జయరామ్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ సామజవరగమనా, రాములో రాములా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రజనీకాంత్ 168 మూవీ టైటిల్ "వియోగం "
AR మురుగదాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీకాంత్ , నయనతార జంటగా యాక్షన్ థ్రిల్లర్ దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ రిలీజ్ కానుంది. తనదైన స్టైల్ లో మూవీస్ లో నటించి ప్రేక్షక,అభిమానులను అలరించే రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 68 సంవత్సరాల వయసులో యువ హీరోలతో పోటీపడి వరుససినిమాలలో నటిస్తున్న రజనీకాంత్ తన 168 వ మూవీ కి సిద్ధమయ్యారు.
పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కన్ఫామ్
గతకొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై పూర్తి రాజకీయాలపైనే ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమాల్లోకి వస్తున్నట్టు గతకొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పింక్ రీమేక్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవి వార్తలు కాదు నిజమే అని తెలిసిపోయింది. దీనిపై తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా కన్ఫామ్ చేశారు.
రజనీకాంత్ అరుదైన గౌరవం - ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ
తన విలక్షణమైన నటనతో.. డిఫరెంట్ మ్యానరిజమ్స్, స్టైల్స్ తో దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింవ అవసరం లేదు సినీ లవర్స్ కి. ఇక ఈ వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక అయన కెరీర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఆయనకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.
సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్స్ అదుర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. నేనొక్కడినే మూవీ తో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ టైమ్ మహేష్ మూవీ కి సంగీతం అందించారు. ఆ మూవీ సక్సెస్ కాకపోయినా దేవిశ్రీ సంగీతం ప్రేక్షకులను అలరించింది. తరువాత దేవిశ్రీ సంగీతం అందించిన శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ మూవీస్ భరత్ అనే నేను, మహర్షి లకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఆ మూవీస్ ఘనవిజయం సాధించినా దేవిశ్రీ సంగీతం ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు - కే.ఏ పాల్ పై పాట విడుదల
తన సినిమాలతో ఎప్పుడూ సెన్సేషన్ క్రియేట్ చేసే వర్మ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆర్ జి వి దర్శకత్వంలో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను రిలీజ్ చేయగా.. నాలుగో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఖైదీ మూవీ టీమ్ కు మహేష్ బాబు అభినందనలు
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజయి రెండు భాషలలోనూ విజయఢంకా మ్రోగిస్తోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ మూవీ ని సత్య సాయి ఆర్ట్స్ KK రాధామోహన్ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు . హీరోయిన్, సాంగ్స్ లేకుండా నైట్ ఎఫెక్ట్ లో తెరకెక్కిన ఖైదీ మూవీ కి ప్రేక్షకాదరణ లభించింది . వసూళ్ళ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఖైదీ మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ప్రభాస్ సినిమాను నిర్మించనున్న రామ్ చరణ్..!
చిరు 152వ సినిమా కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. అందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తాడన్న వార్తలు కూడా వచ్చినసంగతి తెలిసిందే. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను నవంబర్‌లో మొదలుపెట్టి.. మార్చి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసిన ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం.
యాక్షన్ తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియర్ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈసారి టార్గెట్ కే.ఏ పాల్
తన సినిమాలతో ఎప్పుడూ సెన్సేషన్ క్రియేట్ చేసే వర్మ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆర్ జి వి దర్శకత్వంలో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అందులో ముఖ్యంగా ‘బాబు చంపేస్తాడు’ అనే మూడో పాటతో వివాదాస్పదమైన పదాలతో మరోసారి వర్మ వివాదానికే తెరతీశాడు. ఇండైరెక్ట్ గా బాబు ను టార్గెట్ చేసి ఈ పాటను రిలీజ్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. రేపు కే.ఏ పాల్ పై పాటను రిలీజ్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ గ్యాప్ లో ఈ పాట ప్రోమోని రిలీజ్ చేసాడు…

శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని
సినిమా జయాపజయాలతో పని లేకుండా వరుస సినిమాలు చేసుకుంటా వెళ్తున్నాడు శర్వానంద్. ఇప్పటికే ఈ యంగ్ హీరో చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వీటిలోనే శర్వానంద్ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుండే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఉపాసన ట్వీట్ ఎఫెక్ట్ - చిరు,చరణ్ కు మోడీ ఆహ్వానం
మొత్తానికి చిరు కోడలు అనిపించింది ఉపాసన. తాను చేసిన ట్వీట్ మోడీ వరకు చేరిందంటే మాములు విషయం కాదు కదా మరి. అసలు సంగతేంటో గుర్తొచ్చేవుంటుంది కదా. ఇటీవల మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో సినీ తారలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది.. ఈ కార్యక్రమానికి సౌత్ నుండే ఎక్కువ నటీనటులు పాల్గొన్నారు. మన దక్షిణాది నుండి ఒక్క దిల్ రాజు తప్ప మరెవరు కనిపించలేదు. ఇక దీనిపై ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించి.. డైరెక్ట్ గా మోడీనే ప్రశ్నించింది. సినీ రంగం అంటే బాలీవుడ్ ఒక్కటే కాదని, భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దక్షిణాది చిత్ర పరిశ్రమలు…
భీష్మ మూవీ లో నితిన్ కామెడీ స్కిల్స్
PDV ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నితిన్, రష్మిక జంటగా బ్లాక్ బస్టర్ ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ భీష్మ మూవీ సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది. భీష్మ మూవీ లో ఎప్పటికీ ఏ అమ్మాయినీ వివాహం చేసుకోకూడదని ప్రతిజ్ఞ చేసిన బ్రహ్మచారి పాత్రలో నితిన్ నటిస్తున్నారు .మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తరువాత వెంకీ కుడము ల, రష్మిక కాంబినేషన్ లో భీష్మ మూవీ రూపొందుతుంది.
మరో చారిత్రాత్మక మూవీ లో దీపికా పడుకొనే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కమర్షియల్ మూవీస్ తోపాటు హిస్టారికల్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాజీరావ్ మస్తానీ మూవీ లో మస్తానీ గా అలరించిన దీపికాపడుకొనేనటించిన పద్మావత్ మూవీ ఘనవిజయం సాధించి 500కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న మహాభారత్ మూవీ లో ద్రౌపది గా నటించనున్నారు. ఇప్పుడు మరో చారిత్రాత్మక మూవీ కి దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
రంగస్థలం మూవీ తమిళ రీమేక్ లో హీరో
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా రంగస్థలం 2018 సంవత్సరం లో మా ర్చి నెలలో రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. రామ్ చరణ్, సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. దేవిశ్రీ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి. ఇప్పుడు రంగస్థలం మూవీ తమిళ భాషలో రీమేక్ కానుంది.

ఆవిరి తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
చిత్తూరు మాండలీకం లో అల్లు అర్జున్ డైలాగ్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా రెడ్ శాండల్ వుడ్ మాఫియా నేపథ్యంలో రూపొందనున్న AA 20 మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. తమిళ హీరో విజయ సేతుపతి లో ప్రతి నాయకుడి గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది.

'జెర్సీ' హిందీ రీమేక్ - షాహిద్ ప్రాక్టీస్ షురూ
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు.