ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 31

రామోజీ ఫిల్మ్ సిటీ లో యువ హీరోల సందడి

ది వరల్డ్ ఆఫ్ #NC19 రిలీజ్
'ఆదిత్య వర్మ' కూడా కొట్టేశాడుగా..!
'వీరశాస్త్ర అయ్యప్ప కటాక్షం' ట్రైలర్ రిలీజ్
మీరే మాకు స్పూర్తి..!

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సుజీత్ మూవీ?

మరో బాలీవుడ్ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్

#NC19 రేపు రాబోతున్న అప్ డేట్

రామోజీ ఫిల్మ్ సిటీ లో "క్రాక్" మూవీ షూటింగ్

పెళ్ళంటే పడని యువకుడిగా సాయితేజ్?

మరోసారి పోలీస్ అధికారిగా నాగార్జున?
'RRR' హాలీవుడ్ తారల విశేషాలు
రాజమౌళి సినిమాలో నటించే ఎవరికైనా తక్కువ టైం లో ఎక్కువ గుర్తింపు వస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే రాజమౌళి సినిమాలో తక్కువ పాత్ర వున్నా కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇక్కడ నటీనటులకే కాదు... ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ తో హాలీవుడ్ నటీనటులకు కూడా ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. రెండు రోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ను, విలన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి వారి వివరాలు ఏంటో తెలుసుకుందాం..

రామోజీ ఫిల్మ్ సిటీ లో యువ హీరోల సందడి
రామోజీ ఫిల్మ్ సిటీ లో హీరోలు నాని, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్ తమ మూవీస్ షూటింగ్స్ తో సందడి చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా రూపొందుతున్న "V" మూవీ షూటింగ్ ఆర్ ఎఫ్ సి లో జరుగుతుంది. ఈ మూవీ లోని రైల్వే స్టేషన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

ది వరల్డ్ ఆఫ్ #NC19 రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై వైవిధ్య భరిత చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా అందమైన ప్రేమకథ గా #NC19 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య తెలంగాణ యాస లో డైలాగ్స్ పలకడం విశేషం. #NC19 మూవీ లోని నాగ చైతన్య లుక్ ను 22 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

"మోసగాళ్ళు " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు మంచు నిర్మాణ సారథ్యంలో జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ప్రపంచ అతి పెద్ద ఐ. టి స్కామ్ నేపథ్యంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, రుహానీ శర్మ, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ రూపొందుతుంది. హైదరాబాద్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ మూవీ షూటింగ్ లాస్ ఏంజెల్స్ లో జరుగనుంది.
'ఆదిత్య వర్మ' కూడా కొట్టేశాడుగా..!
విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంప్లీట్ బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకోవడమే కాకుండా విజయ్ కెరీర్ నే మార్చేసింది. ఇక హిందీ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. షాహిద్ కపూర్ కూడా ఈ సినిమాలోని పాత్రలో ఒదిగిపోయి నటించేసాడు. ఇక ఈ సినిమాను తమిళ్ కూడా రీమేక్ చేసిన సంగతి విదితమే. తమిళ్ టాలెంటెడ్ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమా రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే తెలుగు, హిందీ లో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై…
'వీరశాస్త్ర అయ్యప్ప కటాక్షం' ట్రైలర్ రిలీజ్
తెలుగులో ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సుమన్ ఆ తర్వాత.. పలు కీలక పాత్రల్లో నటిస్తూ వెళ్తున్నారు. ఎన్నో యాక్షన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు సుమన్ అంతేకాదు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రతో, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్ర తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు.
మీరే మాకు స్పూర్తి..!
తన సినీ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మోహన్ బాబు. ముక్కుసూటి తనం, క్రమశిక్షణ, విభిన్నమైన డైలాగ్ డెలివరీ ఇవన్నీ మోహన్ బాబు కు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు.. ఈ రోజుతో సినీ పరిశ్రమలో మోహన్ బాబు 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
మూవీ మాఫియా అంటున్న కంగనా సోదరి - ఈసారి టాపిక్‌లోకి రౌడీ బాయ్..!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగనా జోలికి ఎవరైనా వచ్చారంటే అంతే సంగతులు. అంతేకాదు బాలీవుడ్ లో వున్న కొంతమందిని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ తో సంచలనం సృష్టిస్తూనే ఉంటుంది. కరణ్ జోహార్ పై,నేపోటిజం పై ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ వేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి మూవీ మాఫియా అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి టాపిక్‌లోకి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా రావడం గమనార్హం.

అఫీషియల్ - రిలీజ్ డేట్స్ వచ్చేశాయి, మహేష్ తర్వాత బన్నీ
ఈ మధ్య సినిమాల రిలీజ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతున్నారు దర్శకనిర్మాతలు. ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. ఇంతకుముందు 'వాల్మీకి', 'గద్దలకొండ గణేష్' సినిమాల రిలీజ్ విషయంలో కన్ఫ్యూషన్ ఉండగా అప్పుడు నిర్మాతలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఒక వారం ఒక సినిమా మరొక వరం ఒక సినిమా రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు బన్నీ, మహేష్ సినిమాలకు కూడా అలానే జరిగింది.

'సరిలేరు నీకెవ్వరు' టీజర్ రిలీజ్ - భయపడే వాడే బేరానికి వస్తాడు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పోస్టర్ లు మాత్రమే రిలీజ్ చేశారు.. మొత్తానికి ఇప్పటికి మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకొనే టైమ్ వచ్చేసింది. ఈ టైం కోసమే ఎప్పటినుండో ఎదుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులను బ్రేక్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేసేసారు.

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ ట్రైలర్ పై రాజమౌళి స్పందన
ఆకృతి &ఆశ్రిత సమర్పణ లో ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరో, నిర్మాత, దర్శకుడిగా ఒక మంచి రసగుల్లా లాంటి సినిమా ట్యాగ్ లైన్ తో రూపొందిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్ భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీడిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది. సత్య, షకలక శంకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్యం రాజేష్, ప్రవీణ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి సంగీతం సాకేత్ కోమండూరి , స్టోరీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ జయమ్ము నిశ్చయమ్మురా మూవీ ఫేమ్ పరం సూర్యాన్షు అందించారు

విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి హాలీవుడ్ ఎంట్రీ
జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో మల్టీ మిలియన్ కాల్ సెంటర్ స్కామ్ నేపథ్యంలో టాలీవుడ్, హాలీవుడ్ నటులతో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, మహిమ ప్రధాన తారాగణంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతుంది. ఈ మూవీ లో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెళ్ళు గా నటించడం విశేషం.

మోహన్ బాబు @ 44 మనిషి ఒక్కడే - పాత్రలు ఎన్నో
తెలుగు సినీపరిశ్రమలో ఎంతో మంది హీరోలు వున్నా అయన డైలాగ్ డెలివరీ అందరికంటే భిన్నం.. ఫైర్ బ్రాండ్.. నా రూటే సెపరేటు అంటాడు..ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి...ఆయన ముక్కుసూటి తనం, క్రమశిక్షణ, సమయపాలన అంటే అందరికీ హడలే. ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు అందరికీ తెలిసిన విషయమే... ఆ హీరోకు కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అని పిలుచుకుంటారు... ఇంతకీ ఆ హీరో ఎవరో అర్థమైవుంటుంది కదా.. ఆయనే మోహన్ బాబు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదడుకులు ఎదుర్కొని..వాటిని అధిగమించి ఉన్నత స్థాయికి ఎదిగారు. తాను వెండి తెరకు పరిచయమై 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అయన గురించి కొన్ని విషయాలు..

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సుజీత్ మూవీ?
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ హీరో గా రూపొందిన సక్సెస్ ఫుల్ మూవీ రన్ రాజా రన్ తో సుజీత్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. సుజీత్ తనరెండవ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే రూపొందించారు. సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా 350కోట్ల బడ్జెట్ తో సాహో మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలలో నిరాశ పరిచింది.

మరో బాలీవుడ్ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారుతున్నారు. 2014 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ మూవీ "యారియాన్" తో బాలీవుడ్ లో ప్రవేశించిన రకుల్ నటించిన దే దే ప్యార్ దే మూవీ ఘనవిజయం సాధించింది. రకుల్ నటించిన "మర్జావాన్ " మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.

#NC19 రేపు రాబోతున్న అప్ డేట్
ఈ నెల 23న పుట్టినరోజు సందర్బంగా తన కొత్త సినిమాలకు సంబందించిన స్పెషల్ అప్డేట్స్ తో చైతు అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇప్పటికే వెంకీమామ సినిమా నుండి కెప్టెన్ కార్తీక్ వస్తున్నాడంటూ ప్రకటించారు. 'వెంకీమామ' నుండి తనకు సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు.

రామోజీ ఫిల్మ్ సిటీ లో "క్రాక్" మూవీ షూటింగ్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రెగ్యులర్ షూటింగ్ నిన్న రామోజీ ఫిల్మ్ సిటీ లోప్రారంభమయింది. రవితేజ , శృతి హాసన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న "క్రాక్ " మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

పెళ్ళంటే పడని యువకుడిగా సాయితేజ్?
`చిత్రలహరి` నుంచి కొత్త తరహా కథాంశాలకు, పాత్రలకు పెద్ద పీట వేస్తున్నాడు సాయితేజ్. విడుదలకు సిద్ధమైన `ప్రతి రోజూ పండగే`... ఈ తరహా చిత్రమే. అంతేకాదు... `సోలో బ్రతుకే సో బెటర్` కూడా సాయితేజ్ ని కొత్తగా ఆవిష్కరించే చిత్రమని టాక్. కాగా... ఆ సినిమా కథాంశం, కథానాయకుడి పాత్రపై టాలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

బాలకృష్ణ - బోయపాటి చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్?
నటసింహ నందమూరి బాలకృష్ణకు అచ్చొచ్చిన స్వరకర్తల్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఒకరు. ముఖ్యంగా... వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి, మలి చిత్రాలు `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` అయితే... అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఆపై `భలేవాడివి బాసూ!`, `సీమసింహం`, `చెన్నకేశవరెడ్డి`, `పలనాటి బ్రహ్మనాయుడు`, `లక్ష్మీ నరసింహా`, `అల్లరి పిడుగు`, `వీరభద్ర`, `ఒక్క మగాడు`, `మిత్రుడు`, `పరమవీరచక్ర`, `లయన్`... ఇలా మరో పదకొండు సినిమాల కోసం ఈ సెన్సేషనల్ కాంబినేషన్ జట్టుకట్టింది. కట్ చేస్తే... ఐదేళ్ళ గ్యాప్ తరువాత బాలయ్య, మణి కాంబినేషన్ లో మరో…

మరోసారి పోలీస్ అధికారిగా నాగార్జున?
ఖాకీ పాత్రలకు వన్నె తెచ్చిన కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. `నిర్ణయం, శాంతి క్రాంతి, రక్షణ, ఆవిడా మా ఆవిడే, శివమణి, ఆఫీసర్` వంటి చిత్రాల్లో పోలీస్ గా అలరించారు నాగ్. కట్ చేస్తే... స్వల్ప విరామం అనంతరం మరోసారి ఈ పాత్రలో దర్శనమివ్వనున్నారట ఈ సీనియర్ హీరో.