ఖాకీ పాత్రలకు వన్నె తెచ్చిన కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. `నిర్ణయం, శాంతి క్రాంతి, రక్షణ, ఆవిడా మా ఆవిడే, శివమణి, ఆఫీసర్` వంటి చిత్రాల్లో పోలీస్ గా అలరించారు నాగ్. కట్ చేస్తే… స్వల్ప విరామం అనంతరం మరోసారి ఈ పాత్రలో దర్శనమివ్వనున్నారట ఈ సీనియర్ హీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `ఊపిరి`, `మహర్షి` చిత్రాల రచయిత సాల్మన్ దర్శకత్వంలో నాగ్ ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులోనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారట నాగ్. ఇప్పటివరకు నాగ్ నటించిన ఖాకీ కథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని టాక్. కాగా… డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… వచ్చే ఏడాది తెరపైకి రానుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: