ఈ మధ్య సినిమాల రిలీజ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతున్నారు దర్శకనిర్మాతలు. ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. ఇంతకుముందు ‘వాల్మీకి’, ‘గద్దలకొండ గణేష్’ సినిమాల రిలీజ్ విషయంలో కన్ఫ్యూషన్ ఉండగా అప్పుడు నిర్మాతలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఒక వారం ఒక సినిమా మరొక వరం ఒక సినిమా రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు బన్నీ, మహేష్ సినిమాలకు కూడా అలానే జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమాల రిలీజ్ విషయంలో కూడా గత కొద్దీ రోజులుగా ఇలాంటి కన్ఫ్యూజనే నడుస్తుంది. రెండు సినిమాలు సంక్రాంతి బరిలోనే దిగనున్నాయని తెలుసు కానీ ఎవరు ముందు వస్తారు..? అన్నదానిపై.. ఎవరు రిలీజ్ మార్చుకుంటారు అన్నదానిపై..? పలు వార్తలు వచ్చాయి. ఇక ఇన్ని రోజులు వున్న డౌట్లకు ఓ క్లారిటీ ఇచ్చేసారు ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నిర్మాతలు. తాజాగా ఇద్దరు నిర్మాతలు మాట్లాడుకొని ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను జనవరి 11 వ తేదీన, ‘అల వైకుంఠపురములో’ సినిమాను జనవరి 12 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ నిర్మాతలు ఒక లేఖ ద్వారా అధికారికంగా తెలిపారు.
కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇక త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: