24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు మంచు నిర్మాణ సారథ్యంలో జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ప్రపంచ అతి పెద్ద ఐ. టి స్కామ్ నేపథ్యంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, రుహానీ శర్మ, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ రూపొందుతుంది. హైదరాబాద్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి
చేసుకొన్న ఈ మూవీ షూటింగ్ లాస్ ఏంజెల్స్ లో జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ “మోసగాళ్ళు “గా , అర్జున్ క్యారెక్టర్ లో నటిస్తున్న విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. “మోసగాళ్ళు ” మూవీ లో విష్ణు, కాజల్ అన్నాచెల్లెళ్ళు గా నటించడం విశేషం. కాప్ గా నటిస్తున్న సునీల్ శెట్టి యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయని సమాచారం. ఇక పోస్టర్ లో విష్ణు లుక్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: