‘ఆదిత్య వర్మ’ కూడా కొట్టేశాడుగా..!

Arjun Reddy Tamil Remake Gets Positive Response

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంప్లీట్ బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకోవడమే కాకుండా విజయ్ కెరీర్ నే మార్చేసింది. ఇక హిందీ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. షాహిద్ కపూర్ కూడా ఈ సినిమాలోని పాత్రలో ఒదిగిపోయి నటించేసాడు. ఇక ఈ సినిమాను తమిళ్ కూడా రీమేక్ చేసిన సంగతి విదితమే. తమిళ్ టాలెంటెడ్ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమా రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే తెలుగు, హిందీ లో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై ముఖ్యంగా ధృవ్ ఎలా చేస్తాడా అన్న అనుమానాలు వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ తంబీలను ఊపేస్తోంది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా ధృవ్ విక్రమ్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. బోల్డ్, ఎమోషనల్ గా సాగే ప్రేమ కథలో తొలి చిత్రంతోనే ధృవ్ నటనలో పరిణితి కనబరిచాడని అంటున్నారు. సినిమాకు ప్రధాన బలం ధృవ్ నటన అని.. ఇది ధృవ్‌కు పర్ఫెక్ట్ డెబ్యూ అని ప్రశంసిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో దొరికాడని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొత్తానికి విక్రమ్ కు వున్న ఒక టెన్షన్ పోయింది. తెలుగు, హిందీ తో పాటు తమిళ్ లో కూడా మంచి హిట్ కొట్టింది. నిజానికి ఇంత భారీ అంచనాలు వున్నప్పుడు వాటిని రీచ్ అవ్వడం అంటే కష్టంతో కూడుకున్న పనే. అలాంటిది తన నటనతో ధృవ్ మెప్పించాడంటే గ్రేటే.. ఎంతైనా విక్రమ్ కొడుకు కదా..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =