సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ రెగ్యులర్ షూటింగ్ నిన్న రామోజీ ఫిల్మ్ సిటీ లోప్రారంభమయింది. రవితేజ , శృతి హాసన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న
“క్రాక్ ” మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“డాన్ శీను”, “బలుపు” వంటి సూపర్ హిట్ మూవీస్ తరువాత గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “క్రాక్ ” రూపొందుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన ” బలుపు ” మూవీ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 6 సంవత్సరాల తరువాత అదే కాంబినేషన్ తో “క్రాక్ ” మూవీ రూపొందడం
విశేషం. ఈ మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























