పెళ్ళంటే ప‌డ‌ని యువ‌కుడిగా సాయితేజ్‌?

Sai Dharam Tej To Play An Interesting Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej New Movie News,Sai Dharam Tej Next Film Upddates,Sai Dharam Tej Upcoming Project Details

`చిత్ర‌ల‌హ‌రి` నుంచి కొత్త త‌ర‌హా క‌థాంశాల‌కు, పాత్ర‌ల‌కు పెద్ద పీట వేస్తున్నాడు సాయితేజ్. విడుద‌ల‌కు సిద్ధ‌మైన `ప్ర‌తి రోజూ పండ‌గే`… ఈ త‌ర‌హా చిత్ర‌మే. అంతేకాదు… `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` కూడా సాయితేజ్ ని కొత్త‌గా ఆవిష్క‌రించే చిత్ర‌మ‌ని టాక్. కాగా… ఆ సినిమా క‌థాంశం, క‌థానాయ‌కుడి పాత్రపై టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… ఇందులో పెళ్ళంటే ప‌డ‌ని యువ‌కుడిగా తేజ్ క‌నిపిస్తాడ‌ని తెలిసింది. త‌న‌ని ఎవ‌రైనా పొర‌పాటున‌ పెళ్ళికి ఆహ్వానిస్తే… ఏదో ఒక విధంగా ఆ పెళ్ళిని ఆపేసే వెరైటీ క్యారెక్ట‌ర్ అట‌. అంతేకాదు… `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` అంటూ ఓ పుస్త‌కం కూడా రాస్తాడ‌ట‌. ఆ పుస్తకాన్ని చ‌దివి, అందులోని సూత్రాల్ని పాటించే అమ్మాయిగా క‌థానాయిక న‌భా న‌టేశ్ పాత్ర ఉంటుంద‌ట‌. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ల‌వ్ ట్రాక్, పెళ్ళిళ్ళు ఆపేసే ఎపిసోడ్స్ హిలేరియ‌స్ గా ఉంటాయ‌ని టాక్. సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి… `మ‌న్మ‌థుడు`కి మ‌రో వెర్ష‌న్ లాంటి ఈ పాత్ర‌తో సాయితేజ్… ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + eleven =