బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగనా జోలికి ఎవరైనా వచ్చారంటే అంతే సంగతులు. అంతేకాదు బాలీవుడ్ లో వున్న కొంతమందిని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ తో సంచలనం సృష్టిస్తూనే ఉంటుంది. కరణ్ జోహార్ పై,నేపోటిజం పై ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ వేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి మూవీ మాఫియా అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి టాపిక్‌లోకి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా రావడం గమనార్హం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలు సంగతేంటంటే.. ఫిలిం కంపానియన్ అనే సంస్థ టాప్ 100 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ తీసి అందులోని నటీనటులకు మెడల్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, విజయ్ దేవరకొండ, తమిళ నటుడు ఫాహద్ ఫాసిల్ ఉన్నారు. ఈ విషయాన్ని తమ ట్విటర్ ఖాతాలో ప్రకటించారు. ఈ విషయం రంగోలీ దృష్టికి వచ్చింది. ఇక ఆమె ఆగుతారా? వరుస ట్వీట్లు చేసి ఏకిపారేసింది.
‘మూవీ మాఫియాకు చెందిన చెంచాగాళ్లు గొప్ప నటీనటులకు మెడల్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇలాంటివాళ్ళు ఎప్పుడూ ఓ గొప్ప పని చేయలేదు. అలాంటిది ఇర్ఫాన్ ఖాన్, విజయ్ దేవరకొండలాంటి గొప్ప నటులు చేసే పనిని వాడుకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? ముందు మీరున్న స్థానాలేంటో చేసుకోండి.. ఆ తర్వాత ఇతరులకు మెడల్స్ ఇవ్వండి అంటూ అబ్బో ఓ రేంజ్ లో తిట్లు దండించింది. అయితే కాస్త ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. మన వాళ్ళని కూడా తిట్టాకుండా.. గొప్ప నటులని పొగిడింది అదే సంతోషం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: