రామోజీ ఫిల్మ్ సిటీ లో హీరోలు నాని, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్ తమ మూవీస్ షూటింగ్స్ తో సందడి చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా రూపొందుతున్న “V” మూవీ షూటింగ్ ఆర్ ఎఫ్ సి లో జరుగుతుంది. ఈ మూవీ లోని రైల్వే స్టేషన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ పోతినేని హీరోగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న “రెడ్ ” మూవీ షూటింగ్ ఆర్ఎఫ్ సి లో జరుగుతుంది. కొన్ని హాస్య సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న “ఎంత మంచివాడవు రా ” మూవీ షూటింగ్ ఆర్ ఎఫ్ సి లో జరుగుతుంది. ఈ మూవీ లోని కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇలా యువ హీరోల మూవీస్ షూటింగ్స్ తో ఆర్ ఎఫ్ సి కళకళలాడుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























