సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పోస్టర్ లు మాత్రమే రిలీజ్ చేశారు.. మొత్తానికి ఇప్పటికి మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకొనే టైమ్ వచ్చేసింది. ఈ టైం కోసమే ఎప్పటినుండో ఎదుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులను బ్రేక్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేసేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో మహేష్ ఎక్కువగా కామెడీ చేయలేదు. మాస్ సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు. అనిల్ రావిపూడి ఈ రెండు విషయాల్లో చాలా కేర్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు.. మహేష్ తో కామెడీ కూడా బాగానే చేయించాడనిపిస్తుంది.
భయపడే వాడే బేరానికి వస్తాడు, మన దగ్గర బేరాల్లేవమ్మా… ప్రతి పండక్కి అల్లుళ్ళు వస్తారు.. ఈ పండక్కి మొగుడు వచ్చాడు.. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేయడానికి ముందుకు వస్తాడు…లాంటి డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక దేవి కూడా ఫాన్స్ కు ఇచ్చిన మాట ను దృష్టిలో పెట్టుకొని మ్యూజిక్ విషయంలో బాగానే జాగ్రత్తలు తీసుకున్నట్టే కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. ప్రకాష్ రాజ్ మరో సారి తన విలనిజాన్ని చూపించడానికి వచ్చేస్తున్నాడు. ఓవరాల్ గా చెప్పాలంటే టీజర్ సూపర్ అనిపించేలానే ఉంది.
మరి మహేష్ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా లైక్స్, వ్యూస్ తో యూ ట్యూబ్ లో ట్రెండ్ అవ్వటం కామన్.. మరి ఈ టీజర్ కూడా లైక్స్, వ్యూస్ తో ఫ్యాన్స్ టాప్ ట్రెండింగ్లో ఉంచుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: