#NC19 రేపు రాబోతున్న అప్ డేట్

Naga Chaitanya New Movie Update,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Chaitanya New Movie,Naga Chaitanya Next Film Updates,Actor Naga Chaitanya Latest News,Naga Chaitanya Upcoming Movie News

ఈ నెల 23న పుట్టినరోజు సందర్బంగా తన కొత్త సినిమాలకు సంబందించిన స్పెషల్ అప్డేట్స్ తో చైతు అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇప్పటికే వెంకీమామ సినిమా నుండి కెప్టెన్ కార్తీక్ వస్తున్నాడంటూ ప్రకటించారు. ‘వెంకీమామ’ నుండి తనకు సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ మరో డిఫరెంట్ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా రేపు ఇవ్వబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. తన పుట్టినరోజు సందర్బంగా నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు సినిమాలో పాత్ర యొక్క టీజర్ ని అభిమానులకు చూపించబోతున్నట్టు సమాచారం.

కాగా రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి లవర్స్ డే కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − seven =