టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారుతున్నారు. 2014 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ మూవీ “యారియాన్” తో బాలీవుడ్ లో ప్రవేశించిన రకుల్ నటించిన దే దే ప్యార్ దే మూవీ ఘనవిజయం సాధించింది. రకుల్ నటించిన “మర్జావాన్ ” మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాశ్వీ నాయర్ దర్శకత్వం లో అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు రకుల్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా రూపొందనున్న మూవీ లో రకుల్ ఒక కీలక పాత్రకు ఎంపికయ్యారు. రకుల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో నటిస్తున్నారు. పలు బాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: