తన సినీ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మోహన్ బాబు. ముక్కుసూటి తనం, క్రమశిక్షణ, విభిన్నమైన డైలాగ్ డెలివరీ ఇవన్నీ మోహన్ బాబు కు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విలన్గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు.. ఈ రోజుతో సినీ పరిశ్రమలో మోహన్ బాబు 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా మంచు మనోజ్, మంచు విష్ణు తమ తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా తమ అనడాన్ని పంచుకున్నారు. ‘ఈ 44 ఏళ్ల మీ సినీ ప్రయాణం మీకు ఓ అనుభవం కావచ్చు.. మాకు మాత్రం స్ఫూర్తిగా నిలుస్తోంది. టాలీవుడ్ సినీ పరిశ్రమలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు నాన్న. సినిమా ద్వారా ఎదిగి చాలా మందికి విద్య, జీవనోపాధి కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఇక మంచు విష్ణు కూడా.. ” మై ఫాథర్.. మై హీరో.. మీరు ఈ సినీ ప్రపంచంలో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతలు.. మీ ప్రయాణం మాకు స్ఫూర్తి దాయకం కావాలని పోస్ట్ లో పేర్కొన్నాడు.
ప్రస్తుతం మోహన్ బాబు..తమిళంలో సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో విలన్గా నటిస్తున్నారు. మరి ముందు ముందు కూడా మోహన్ బాబు ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుందాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: