మోహన్ బాబు @ 44 మనిషి ఒక్కడే – పాత్రలు ఎన్నో

44 Years For Mohan Babu In TFI,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mohan Babu Successful Completed 44 Years in TFI,Mohan Babu Completes 44 Years in Industry,Dialogue King Mohan Babu 44 Years

తెలుగు సినీపరిశ్రమలో ఎంతో మంది హీరోలు వున్నా అయన డైలాగ్ డెలివరీ అందరికంటే భిన్నం.. ఫైర్ బ్రాండ్.. నా రూటే సెపరేటు అంటాడు..ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి…ఆయన ముక్కుసూటి తనం, క్రమశిక్షణ, సమయపాలన అంటే అందరికీ హడలే. ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు అందరికీ తెలిసిన విషయమే… ఆ హీరోకు కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అని పిలుచుకుంటారు… ఇంతకీ ఆ హీరో ఎవరో అర్థమైవుంటుంది కదా.. ఆయనే మోహన్ బాబు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదడుకులు ఎదుర్కొని..వాటిని అధిగమించి ఉన్నత స్థాయికి ఎదిగారు. తాను వెండి తెరకు పరిచయమై 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అయన గురించి కొన్ని విషయాలు..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* మోహన్‌ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 19 మార్చి 1952న జన్మించారు. తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు (ఉపాధ్యాయుడు), తల్లి లక్ష్మమ్మ. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సల నాయుడు. ఏర్పేడులో 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత హైస్కూల్ విద్యాభ్యాసం తిరుపతిలో జరిగింది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మద్రాసులో చదువుకున్నారు.

* సినీరంగంలో ప్రవేశించడానికి ముందు మోహన్‌ బాబు తండ్రి కోరిక మేరకు కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. 1970 ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు.

* 1975 న‌వంబ‌ర్ 22న విడుద‌లైన స్వ‌ర్గం న‌ర‌కం అనే సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయ్యారు మోహ‌న్ బాబు. ఆ చిత్రంతోనే భక్తవత్సలం నాయుడు నుంచి మోహన్‌బాబుగా పేరు మార్చారు దాసరి.

* విలన్ పాత్రలతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని… ఆ తర్వాత హీరో గా మారి చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించారు.

* అంతేకాదు నిర్మాతగా లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలను నిర్మించారు. 75కి పైగా సినిమాలు నిర్మించారు. 20కి పైగా వేరే భాషా సినిమాల‌లో న‌టించారు.

* ఈయన నిర్మాతగా చేసిన పెదరాయుడు (1995) 475 రోజులు, మేజర్ చంద్రకాంత్ (1993) 270 రోజులు, కలెక్టర్‌గారు (1996) 275 రోజులు, అల్లరి మొగుడు (1992) 200 రోజులు ఆడి రికార్డులు క్రియేట్‌ చేశాయి.

* సినీరంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నారు.

* తనకుజన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే సినీ జీవితాన్నిచ్చింది దాసరి నారాయణరావు అని చెబుతారు. అందుకే ఆయనను గురువుగారు అని పిలుచుకుంటారు.

* ఇక ఇన్నేళ్ల కెరీర్ లో అయన సాధించిన అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌, ఫిలిం ఫేర్ అవార్డ్ గ్ర‌హీత‌, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రీకృష్ణ దేవరాయల పురస్కారం సొంతం చేసుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, కళా పరిపూర్ణ, డా.బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డు, కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ నుండి డాక్ట‌రేట్ అందుకున్న వ్య‌క్తి.. ఇలా మోహ‌న్ బాబు సాధించిన ఘ‌న‌త‌లు ఎన్నో ఉన్నాయి.

* ఇక రాజకీయాల్లో కూడా తన మార్క్ ను చూపించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.1995లో మోహన్‌బాబు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగారు. ఇప్పుడు వై.సీ.పీ పార్టీకి పనిచేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు

* ప్రస్తుతం మోహన్ బాబు..తమిళంలో సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. మరి ముందు ముందు కూడా మోహన్ బాబు ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుందాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 10 =