ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 13

"దర్బార్" మూవీ ట్రైలర్ రిలీజ్
త్వరలోనే నా కల నెరవేరనుంది - దిల్ రాజు
అల .. వైకుంఠపురములో .. టబు డబ్బింగ్ షురూ

"తూటా " మూవీ విడుదల తేదీ ఖరారు
బిగ్గెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ "వెంకీ మామ "
సత్యరాజ్ డబుల్ ధమాకా
అజిత్ కి విలన్ గా కార్తికేయ?
అనుష్కతో పోటీ పడుతున్న నాగశౌర్య
ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ?
`వెంకి మామ` దర్శకుడితో అల్లు అర్జున్?

`రంగమార్తాండ`లో శివాత్మికా రాజశేఖర్?

`పింక్` రీమేక్ లో అంజలి?

14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో #NC 20 మూవీ
తక్కువ గ్యాప్ లోనే రవితేజ డబుల్ ఎంటర్ టైన్ మెంట్
గత ఏడాది `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమర్ అక్బర్ ఆంటొని` చిత్రాలతో పలకరించిన మాస్ మహారాజా రవితేజ... ఈ సంవత్సరం మాత్రం `జీరో రిలీజెస్`తో సరిపెట్టాడు. అయితే, వచ్చే ఏడాది ఇందుకు భిన్నంగా తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలతో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ఆ చిత్రాలే... `డిస్కో రాజా`, `క్రాక్`.

"నిశ్శబ్ధం " మూవీ "నిన్నే నిన్నే "సాంగ్ ప్రోమో రిలీజ్
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

"దర్బార్" మూవీ ట్రైలర్ రిలీజ్
"గజిని ", "స్టాలిన్ ", తుపాకీ" వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ " దర్బార్ "తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి. చాలా కాలం తరువాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన " దర్బార్ " మూవీ లో నయనతార కథానాయిక. నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటించారు.
"ఇద్దరి లోకం ఒకటే"మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్
యంగ్ హీరో రాజ్ తరుణ్, బ్లాక్ బస్టర్ మూవీ "అర్జున్ రెడ్డి "ఫేమ్ షాలిని పాండే జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా "ఇద్దరి లోకం ఒకటే" మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాజర్ ముఖ్య పాత్రలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

"సరిలేరు నీకెవ్వరు " మూవీ " హి ఈజ్ సో క్యూట్ "సాంగ్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. "రాములమ్మ" విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు.
త్వరలోనే నా కల నెరవేరనుంది - దిల్ రాజు
మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు, ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మాణ సారథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సూపర్ హిట్ హిందీ మూవీ "పింక్ "తెలుగు రీమేక్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితం బోనీకపూర్ అఫీషియల్ గా ప్రకటించారు.
అల .. వైకుంఠపురములో .. టబు డబ్బింగ్ షురూ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ టబు టాలీవుడ్ కు కమ్ బ్యాక్ మూవీ. అల .. వైకుంఠపురములో .. మూవీ లో హీరో అల్లు అర్జున్, టబు లపై చిత్రీకరించిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం.

"తూటా " మూవీ విడుదల తేదీ ఖరారు
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘా ఆకాశ్ జంటగా రూపొందిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ "ఎన్నై నొక్కి పాయుమ్ తోట "తమిళ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి వైవిధ్య భరిత చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. రానా దగ్గుబాటి, శశి కుమార్ , సునైనా ముఖ్య పాత్రలలో నటించారు. డి .శివ సంగీతం అందించారు.
బిగ్గెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ "వెంకీ మామ "
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. రావు రమేష్ , నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

"సరిలేరు నీకెవ్వరు " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించగా, మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
సత్యరాజ్ డబుల్ ధమాకా
`బాహుబలి` సిరీస్ లో కట్టప్పగా అలరించిన సత్యరాజ్... ఆ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా... తెలుగునాట సత్యరాజ్ కి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు అందించింది సదరు కట్టప్ప పాత్ర. ఈ నేపథ్యంలో... సత్యరాజ్ నుంచి ఓ సినిమా వస్తుందంటేనే ప్రత్యేక ఆసక్తి నెలకొంటోంది.
అజిత్ కి విలన్ గా కార్తికేయ?
గత ఏడాది `ఆర్ ఎక్స్ 100` రూపంలో సెన్సేషనల్ హిట్ అందుకున్న యువ కథానాయకుడు కార్తికేయ... ఈ సంవత్సరం ఏకంగా నాలుగు చిత్రాలతో (హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90 ML) సందడి చేశాడు. వీటిలో `గ్యాంగ్ లీడర్`లో పోషించిన విలన్ రోల్... కార్తికేయకి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చింది. తనలోని టాలెంట్ ని కొత్త కోణంలో ఆవిష్కరించింది.
అనుష్కతో పోటీ పడుతున్న నాగశౌర్య
వచ్చే ఏడాది జనవరి 31న ఆసక్తికరమైన పోటీ నెలకొంటోంది. ఎందుకంటే... అదే రోజున రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఆ చిత్రాలే... `నిశ్శబ్దం`, `అశ్వథ్థామ`.
ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ?
`అధినాయకుడు` (2012)... నటసింహ బాలకృష్ణ కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. ఇందులో మూడు తరాలకు చెందిన మూడు విభిన్న పాత్రల్లో నటించి అలరించాడు బాలయ్య. అలాగే త్రిపాత్రాభినయంలో తనదైన ముద్రవేశాడు. అలాంటి... `అధినాయకుడు`కి దర్శకత్వం వహించిన పరుచూరి మురళి డైరెక్షన్ లో బాలయ్య ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని టాక్.
`వెంకి మామ` దర్శకుడితో అల్లు అర్జున్?
`పవర్`తో దర్శకుడిగా పరిచయమైన బాబీ అలియాస్ కె.యస్. రవీంద్ర... అనంతరం `సర్దార్ గబ్బర్ సింగ్`, `జై లవ కుశ` చిత్రాలతో అలరించాడు. ఇక తాజాగా విడుదలైన తన మల్టీస్టారర్ మూవీ `వెంకి మామ` వసూళ్ళ వర్షం కురిపిస్తూ విజయపథంలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో... బాబీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బాలయ్య బర్త్ డే స్పెషల్ గా బోయపాటి ఫిల్మ్?
నటసింహ నందమూరి బాలకృష్ణది 45 ఏళ్ళ నటనాప్రస్థానం. అయితే, ఈ ప్రయాణంలో ఇప్పటివరకు తన బర్త్ డే స్పెషల్ గా సినిమాలు రిలీజైన సందర్భాలు లేవు. ఎట్టకేలకు అభిమానులకు ఆ ముచ్చటా తీరే అవకాశం ఉందని వినిపిస్తోంది.

`రంగమార్తాండ`లో శివాత్మికా రాజశేఖర్?
`దొరసాని`తో కథానాయికగా తొలి అడుగు వేసింది రాజశేఖర్ - జీవిత గారాలపట్టి శివాత్మిక. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ గర్ల్ కి... ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కిందని ఫిల్మ్ నగర్ టాక్.

`పింక్` రీమేక్ లో అంజలి?
హిందీ బ్లాక్ బస్టర్ మూవీ `పింక్` తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెరకెక్కనున్న ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాని `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో #NC 20 మూవీ
హీరో నాగచైతన్య , వెంకటేష్ తో కలసి నటించిన మల్టీ స్టారర్ మూవీ "వెంకీమామ " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగచైతన్య ప్రస్తుతం ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న #NC 19 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అందమైన ప్రేమకథ గా రూపొందుతున్న ఈ మూవీలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్నారు. నాగచైతన్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"వెంకీ మామ " మూవీ ఫస్ట్ డే రికార్డ్
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా నాజర్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.