“గజిని “, “స్టాలిన్ “, తుపాకీ” వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ” దర్బార్ “తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి. చాలా కాలం తరువాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ” దర్బార్ ” మూవీ లో నయనతార కథానాయిక. నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ” దర్బార్ ” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలు ఉన్న ” దర్బార్ ” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. యాక్షన్ ప్యాక్డ్ గా రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను
విశేషంగా ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























