వచ్చే ఏడాది జనవరి 31న ఆసక్తికరమైన పోటీ నెలకొంటోంది. ఎందుకంటే… అదే రోజున రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఆ చిత్రాలే… `నిశ్శబ్దం`, `అశ్వథ్థామ`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ `నిశ్శబ్దం` పలు భాషల్లో జనవరి 31న రిలీజ్ కానుండగా… అదే రోజు తన హోమ్ బేనర్ లో నాగశౌర్య కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `అశ్వథ్థామ` కూడా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో… ఈ రెండు సినిమాల పోటీపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… 2018లో అనుష్క నటించిన ఫిమెల్ సెంట్రిక్ ఫిల్మ్ `భాగమతి` జనవరి 26న రిలీజ్ కాగా… తన హోమ్ బేనర్ లో శౌర్య నటించిన తొలి చిత్రం `ఛలో` ఫిబ్రవరి 2న విడుదలైంది. వారం గ్యాప్ లో వచ్చిన ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. మరి… ఇప్పుడు ఒకే రోజున రానున్న `నిశ్శబ్దం`, `అశ్వథ్థామ` కూడా అదే బాట పడుతాయేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: