`దొరసాని`తో కథానాయికగా తొలి అడుగు వేసింది రాజశేఖర్ – జీవిత గారాలపట్టి శివాత్మిక. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ గర్ల్ కి… ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కిందని ఫిల్మ్ నగర్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో `రంగమార్తాండ` అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరాఠీ బ్లాక్ బ్లస్టర్ `నట సామ్రాట్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్నారు. వారి కుమార్తె పాత్రలో శివాత్మిక కనిపిస్తుందని సమాచారం. అలాగే గాయనిగా ఆమె దర్శనమిస్తుందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు… `బిగ్ బాస్ సీజన్ 3` టైటిల్ విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ కి జోడీగా ఆమె పాత్ర ఉంటుందని వినికిడి. మరి… ఈ చిత్రంతోనైనా శివాత్మికకి విజయం దక్కుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























