ఆ ద‌ర్శ‌కుడికి మ‌రో ఛాన్స్ ఇస్తున్న బాల‌కృష్ణ‌?

Balakrishna Teams Up With Adhinayakudu Director After 8 Years

`అధినాయ‌కుడు` (2012)… న‌ట‌సింహ బాల‌కృష్ణ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం. ఇందులో మూడు త‌రాల‌కు చెందిన మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టించి అల‌రించాడు బాల‌య్య‌. అలాగే త్రిపాత్రాభిన‌యంలో త‌న‌దైన ముద్ర‌వేశాడు. అలాంటి… `అధినాయ‌కుడు`కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌రుచూరి ముర‌ళి డైరెక్ష‌న్ లో బాల‌య్య ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు… వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంద‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే… బాల‌య్య అప్ క‌మింగ్ ఫిల్మ్ `రూల‌ర్`కి ప‌రుచూరి ముర‌ళినే క‌థ‌ను అందించాడు. కె.య‌స్. ర‌వికుమార్ డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ డిసెంబ‌ర్ 20న రాబోతోంది. దీనిని నిర్మించిన సి.క‌ళ్యాణ్ నే బాల‌య్య‌, ముర‌ళి సినిమాని కూడా ప్రొడ్యూస్ చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి… నెక్ట్స్ వెంచ‌ర్ తోనైనా బాల‌య్య‌, ముర‌ళి కాంబినేష‌న్ స‌క్సెస్ అందుకుంటుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 16 =