హిందీ బ్లాక్ బస్టర్ మూవీ `పింక్` తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెరకెక్కనున్న ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాని `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి శ్రీమతి పాత్రలో తెలుగమ్మాయి అంజలి నటిస్తోందని ప్రచారం సాగుతోంది. `పింక్` తమిళ వెర్షన్ `నేర్ కొండ పార్వై`లో అజిత్ జోడీగా విద్యా బాలన్ పోషించిన పాత్ర ఆధారంగా అంజలి క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్లు టాక్. త్వరలోనే అంజలి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా… అంజలి ఓ కీలక పాత్రలో నటించిన `నిశ్శబ్దం` జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటించింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: