“నిశ్శబ్ధం ” మూవీ “నిన్నే నిన్నే “సాంగ్ ప్రోమో రిలీజ్

Ninne Ninne Song Promo Out From Nishabdham Movie

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం ” జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హాలీవుడ్ క్రాస్ ఓవర్ గా రూపొందిన “నిశ్శబ్ధం ” మూవీ లో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “నిశ్శబ్ధం ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఒక సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసింది. గోపిసుందర్ స్వరకల్పనలో భాస్కరభట్ల రచన , సిద్ శ్రీరామ్ ఆలపించిన “నిన్నే నిన్నే “సాంగ్ ప్రోమో ఇంప్రెసివ్ గా ఉండి సాంగ్ పై ఆసక్తిని కలిగించింది. సియోటెల్ లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ “నిశ్శబ్ధం “. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ, ఇంగ్లిష్ భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.