గత ఏడాది `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమర్ అక్బర్ ఆంటొని` చిత్రాలతో పలకరించిన మాస్ మహారాజా రవితేజ… ఈ సంవత్సరం మాత్రం `జీరో రిలీజెస్`తో సరిపెట్టాడు. అయితే, వచ్చే ఏడాది ఇందుకు భిన్నంగా తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలతో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ఆ చిత్రాలే… `డిస్కో రాజా`, `క్రాక్`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ `డిస్కో రాజా` జనవరి 24న విడుదల కానుండగా… కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న గోపీచంద్ మలినేని డైరెక్టోరియల్ `క్రాక్` 2020 వేసవిలో సందడి చేయనుంది. మరి… `రాజా ది గ్రేట్` తరువాత సరైన విజయం లేని రవితేజకి ఈ చిత్రాలైనా సక్సెస్ ని అందిస్తాయేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























