గత ఏడాది `ఆర్ ఎక్స్ 100` రూపంలో సెన్సేషనల్ హిట్ అందుకున్న యువ కథానాయకుడు కార్తికేయ… ఈ సంవత్సరం ఏకంగా నాలుగు చిత్రాలతో (హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90 ML) సందడి చేశాడు. వీటిలో `గ్యాంగ్ లీడర్`లో పోషించిన విలన్ రోల్… కార్తికేయకి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చింది. తనలోని టాలెంట్ ని కొత్త కోణంలో ఆవిష్కరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే… ఇప్పుడు మరోసారి ప్రతినాయకుడిగా నటించే అవకాశం కార్తికేయని వరించిందని సమాచారం. అయితే, ఈ సారి కోలీవుడ్ నుంచి ఆ ఆఫర్ దక్కిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ అజిత్, టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబినేషన్ లో `వలిమై` పేరుతో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనే విలన్ గా నటించే ఛాన్స్ కార్తికేయకి దక్కిందని వినికిడి. అదే గనుక నిజమైతే… కెరీర్ ఆరంభంలోనే అజిత్ లాంటి స్టార్ ని ఢీ కొట్టే ఛాన్స్ కార్తికేయకి దక్కడం కచ్చితంగా వార్తల్లో నిలచే అంశమనే చెప్పాలి.
మరి… అజిత్ కాంబినేషన్ మూవీలో కార్తికేయ ఏ స్థాయి విలనిజాన్ని ప్రదర్శిస్తాడో తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు వేచిచూడాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: