ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 12

2019... నాగచైతన్యకి వెరీ వెరీ స్పెషల్
యన్టీఆర్ లక్కీ డేట్ కి బాలయ్య `రూలర్`

25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న `క్రాక్`
వారం గ్యాప్ లో వస్తున్న మామాఅల్లుళ్ళు

త్రివిక్రమ్ తోనే తర్వాత సినిమా..!

'పింక్' తర్వాత 'పవన్' ముల్టీస్టారర్..?
'ఇద్దరి లోకం ఒకటే' ట్రైలర్ రిలీజ్

ఈసారి క్రైమ్ డ్రామా..!

"అతడే శ్రీమన్నారాయణ" మూవీ 5 భాషల రిలీజ్ డేట్స్
సూపర్ స్టార్స్ 'యూ ట్యూబ్' వార్
ట్రాన్స్ జెండర్ గా నటించాలని ఉంది - రజనీకాంత్

"వెంకీ మామ " కు అభినందనలు
కాజల్ అగర్వాల్ కు అరుదైన గౌరవం
అజిత్ కి జోడీగా ఇలియానా?
దిల్ రాజు కు బర్త్ డే శుభాకాంక్షలు - విజయ్ దేవరకొండ
మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ దిల్ రాజు కు బర్త్ డే విషెస్ తెలిపారు 2003 సంవత్సరం "దిల్ " మూవీ తో టాలీవుడ్ కు దిల్ రాజు నిర్మాతగా పరిచయం అయ్యారు. ఆ మూవీ ఘనవిజయంతో దిల్ అయన ఇంటి పేరుగా మారడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఆర్య , బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారులోకం, బృందావనం, M r పర్ ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, సుప్రీమ్ , శతమానం భవతి, నేను లోకల్, డిజె, ఫిదా, రాజా ది గ్రేట్, MCA , F 2 , మహర్షి మూవీస్ ఘనవిజయం సాధించాయి. అనేక మంది దర్శకులను దిల్ రాజు టాలీవుడ్ కు పరిచయం చేశారు.

2019... నాగచైతన్యకి వెరీ వెరీ స్పెషల్
యువ సామ్రాట్ నాగచైతన్యకి 2019 సంవత్సరం భలేగా కలిసొచ్చింది. `రారండోయ్ వేడుక చూద్దాం` (2017) తరువాత సరైన విజయం లేని చైతూకి... ఈ ఏడాది `మజిలీ`, `వెంకి మామ` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందాయి. అలాగే, ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఈ అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో రెండు వరుస విజయాలు చూడడం ఇదే తొలిసారి కావడం విశేషం.
`మా అన్నయ్య`, `సంక్రాంతి` తరహాలో నాని చిత్రం?
`నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `టక్ జగదీష్`. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ నాయికలుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీకి ఎంటర్ టైనర్ కి థమన్ బాణీలను అందిస్తున్నాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
యన్టీఆర్ లక్కీ డేట్ కి బాలయ్య `రూలర్`
నటసింహ నందమూరి బాలకృష్ణకి తన తండ్రి, మహానటుడు నందమూరి తారక రామారావు పాత చిత్రాల తాలూకు టైటిల్స్, డేట్స్ పలు సందర్భాల్లో కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలోనే... తండ్రి యన్టీఆర్ కి అచ్చొచ్చిన డేట్ నే టార్గెట్ చేసుకుని బాలయ్య తాజా చిత్రం `రూలర్` కూడా రాబోతోంది.

25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న `క్రాక్`
`డాన్ శీను`, `బలుపు` చిత్రాల తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `క్రాక్` పేరుతో రూపొందుతున్న ఈ కాప్ స్టోరీలో రవితేజకి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా... యువ సంగీత సంచలనం థమన్ బాణీలను అందిస్తున్నాడు. `ఠాగూర్` మధు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాడు.
వారం గ్యాప్ లో వస్తున్న మామాఅల్లుళ్ళు
2020 పొంగల్... తమిళ తంబీలకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే... ఈ సారి సంక్రాంతికి కోలీవుడ్ మామాఅల్లుళ్ళు బాక్సాఫీస్ వద్ద వినోదాలు పంచడానికి సిద్దమయ్యారు. వారం రోజుల గ్యాప్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయనుండడం కోడంబాక్కం లో హాట్ టాపిక్ గా మారింది.

త్రివిక్రమ్ తోనే తర్వాత సినిమా..!
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక గతకొద్ది కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా వున్న ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమా కోసం ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. స్క్రిప్ట్ పనులు త్వరలోనే మొదలుపెట్టనున్నాడట త్రివిక్రమ్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
'అల వైకుంఠపురములో' స్పెషల్ టార్గెట్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్..!
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దానికి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

'పింక్' తర్వాత 'పవన్' ముల్టీస్టారర్..?
అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను తమిళంలో 'నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో.. అజిత్ ప్రధాన పాత్రలో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. ఇప్పుడు తెలుగులోను పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ…
'ప్రతిరోజూ పండగే' - రాశీ పాడిన ‘యు ఆర్ మై హై’ పాట రిలీజ్
మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ను, పాటలు, ట్రయిలర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, పాటలు అన్నీ బాగుండటంతో చిత్రం కూడా అలరిస్తుందనే నమ్మకం ఏర్పడింది అందరిలో. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ‘యు ఆర్ మై హై’ అనే మరో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పాటను రాశీఖన్నానే పాడటం.
'ఇద్దరి లోకం ఒకటే' ట్రైలర్ రిలీజ్
'లవర్ ' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొత్త సినిమాతో రాబోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ హీరో గా, అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్ గా.. జి.ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను పాటలను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈసారి క్రైమ్ డ్రామా..!
ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ వంగ. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లు గా తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలన విజయం సాధించి కొత్త ట్రెండ్ కు నాంది పలికాడు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇదే సినిమాను షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరో హీరోయిన్లు గా హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కబీర్ సింగ్ మూవీ ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో షాహిద్ కపూర్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.

"అతడే శ్రీమన్నారాయణ" మూవీ 5 భాషల రిలీజ్ డేట్స్
"అవనే శ్రీమన్నారాయణ " కన్నడ మూవీ 5భాషలలో రిలీజ్ కానుంది. పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ "అవనే శ్రీమన్నారాయణ " కన్నడ మూవీ డిసెంబర్ 27 వ తేదీ కన్నడం లో రిలీజ్ కానుంది. శాన్వి కథానాయిక. అజనీష్ లోక్ నాథ్ ,చరణ్ రాజ్ సంగీతం అందించారు.
సూపర్ స్టార్స్ 'యూ ట్యూబ్' వార్
తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్, టాలీవుడ్ సూపర్ స్టార్ మధ్య యూ ట్యూబ్ వార్ ఏంటబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మహేష్ బాబు హీరో అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ సినిమా అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ప్రతి సోమవారం ఈ సినిమా నుండి ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ' హీ ఈజ్ సో క్యూట్' అనే పాటను రిలీజ్ చేశారు.
ట్రాన్స్ జెండర్ గా నటించాలని ఉంది - రజనీకాంత్
ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "దర్బార్ " మూవీ తెలుగు, తమిళ భాషలలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. "దర్బార్ " మూవీ ట్రైలర్ సందర్భంగా మీడియా సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ గా నటించాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"వెంకీ మామ " కు అభినందనలు
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీమామ " మూవీ ఘనవిజయం సాధించి , రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ లో వెంకటేష్, నాగచైతన్య లు మామ అల్లుళ్ళు గా నటించారు. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు, థమన్ ఎస్ సంగీతం అందించారు.
కాజల్ అగర్వాల్ కు అరుదైన గౌరవం
టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందం, అభినయం తో అలరిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అరుదైన గౌరవం అందుకున్నారు. పర్యాటకుల ఎట్రాక్షన్ కై దేశ ,విదేశాలలో మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం లు ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యూజియం లలో రాజకీయ నాయకులు , మూవీ నటీనటులు, స్పోర్ట్స్ పర్సన్ ల మైనపు ప్రతిమలు కొలువుతీరతాయి. మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం సెవెంత్ ఆసియన్ బ్రాంచ్ సింగపూర్ లో 2014సంవత్సరంలో ప్రారంభం అయింది.
క‌్లీన్ `యు` సర్టిఫికేట్ తో `ప్రతి రోజూ పండగే`
`సుప్రీమ్` తరువాత మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్, అందాల తార రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం `ప్రతి రోజూ పండగే`. సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి మారుతి దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఎ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
అజిత్ కి జోడీగా ఇలియానా?
పుష్కర కాలం క్రితం తెలుగునాట సంచలనం సృష్టించిన అందం... ఇలియానా. గత కొంత కాలంగా బాలీవుడ్ పై దృష్టి సారించిన ఈ గోవా బ్యూటీ... మాస్ మహారాజా రవితేజ `అమర్ అక్బర్ ఆంటొని`తో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా... తన నటనతో, సొంత గొంతుతో మురిపించింది ఇలియానా.
ఫిబ్రవరి నుంచి `ఫైటర్`తో సందడి చేయనున్న జాన్వీ కపూర్?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. `ఫైటర్` పేరుతో రూపొందనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే... పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కనున్న `ఫైటర్`లో అతిలోక సుందరి శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.