ట్యాగ్ · 107 కథనాలు · పేజీ 5
పవన్ ఫ్యాన్స్ కు అండగా చరణ్, బన్నీ

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ
'గీతా ఆర్ట్స్ ఆఫీస్' దగ్గర - ఎలాంటి హడావుడి లేదు
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్ డేట్
'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌గా ‘పుష్ప’
'పరుగు' కాంబినేషన్‌లో మరో చిత్రం?
"గీత గోవిందం " మూవీ వద్దు - అల్లు అర్జున్
చిరు సినిమాలో బన్నీ.. అంతా తూచ్..!
"పుష్ప "మూవీ సర్ ప్రైజింగ్ న్యూస్
చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్?
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్
బన్నీ ఐకాన్ సినిమా.. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుండి వార్తల్లోనే ఎక్కువ నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దానికి తోడు బన్నీ త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టేసరికీ అప్పట్లో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ బన్నీ పుట్టినరోజున చిత్రయూనిట్ తరపున విషెస్ చెప్పి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.
పవన్ ఫ్యాన్స్ కు అండగా చరణ్, బన్నీ
పవన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలన్న నేపథ్యంలో ఆయన ఫ్లెక్సీ కడుతూ అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఘటన అటు అభిమానుల్లోనూ.. మెగా ఫ్యామిలీకి విషాదాన్ని మిగిల్చింది. ఇంకా పలువురు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. అంతేకాదు మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు పవన్.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ
యూనివర్సల్ మీడియా బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ 2007 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక ఈ మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. "దేశముదురు " మూవీ లో హీరోయిన్ రంభ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. యాక్షన్ సీన్స్ , సాంగ్స్ , అలీ కామెడీ ట్రాక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.
'గీతా ఆర్ట్స్ ఆఫీస్' దగ్గర - ఎలాంటి హడావుడి లేదు
లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావుడి అనేది లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక సినిమా ఓపెనింగ్ అంటూనో.. ఆడియో రిలీజ్ అంటూనే.. సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఇలా నిత్యం హడావుడి.. బిజీ బిజీ గా ఉంటుంది. కానీ కరోనా వల్ల పరిస్థితి మారిపోయింది. సెలబ్రిటీస్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఇంట్లోనే ఉన్న అల్లు అర్జున్ తాజాగా తమ గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీస్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
పేద రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయన వల్లే ఇలా ఉన్నాం..!
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ కూడా ఒకరు.. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకడు.. మరి ఈ రోజు వీరు ఈ పొజిషన్ లో ఉన్నారంటే దానికి ఆనాటి లెజెండ్రీ కమెడియన్ అల్లు రామలింగయ్య అని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు సినీ ఇండస్ట్రీలో అల్లు బ్రాండ్ అంత స్ట్రాంగ్ గా ఉండటానికి ఆయనే కారణం. ఎన్నో చిత్రాల్లో తనదైన హాస్యంతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు రామలింగయ్య. ఆ రోజుల్లో వెండితెరపై అల్లు రామలింగయ్యను మించిన కమెడియన్ లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పిస్తున్నారు.
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా.. ఈ కాంబినేషన్ పై ఇప్పటినుండి కాదు గత కొద్దిరోజులుగా వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా ఫిక్స్ అయిందని... త్వరలో అప్ డేట్ కూడా ఇస్తారన్న వార్తలు వినిపించాయి. ఇక ఈ కాంబినేషన్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. అయితే ఇప్పుడు అనుమానాలన్నిటికి బ్రేక్ వేసి అధికారిక ప్రకటన ఇచ్చేసారు. బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్ డేట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో రష్మిక కథానాయిక. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్న "పుష్ప " మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా "పుష్ప " మూవీ షూటింగ్ నిలిచిపోయింది .
అల్లు అర్జున్ , ఎన్టీఆర్ డ్యాన్స్ లు ఇష్టం - ప్రణీత సుభాష్
తెలుగు , తమిళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్ ప్రస్తుతం "రామన అవతార "కన్నడ మూవీ లో నటిస్తున్నారు. "భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా " మూవీ తో ప్రణీత బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. మరో హిందీ మూవీ "హంగామా 2" లో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బాధితులకు తనవంతు సాయం అందజేశారు. ఆదివారం (5వ తేదీ ) ప్రణీత ట్విట్టర్ లో తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
హ్యాపీ బర్త్ డే శిరి.. నువ్వు ఎప్పుడూ నా ఫెవరెట్ బేబీనే..!
అల్లు అర్జున్- అల్లు శిరీష్ ల మధ్య ఉన్న సంబంధం గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ అవ్వడానికి అన్నదమ్ములు అయినా... ఫ్రెండ్స్ లాగానే ఉంటారన్న సంగతి చాలా సందర్భాల్లో చూశాం. ఇక ఈ రోజు అల్లు శిరీష్ పుట్టిన రోజు కావడంతో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే శిరి.. ఈ ప్రపంచంలోనే నువ్వు ఎప్పుడూ నా ఫెవరెట్ బేబీనే అంటూ తమ్ముడిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసాడు.
ఫస్ట్ 'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌గా ‘పుష్ప’..!
సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే ఆ సినిమా కాస్టింగ్ లో విదేశీ నటీనటులు, టెక్నిషియన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ ఓ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు కానీ.. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీయనున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? ఆ సినిమా ఏదో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘పుష్ప’.
'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌గా ‘పుష్ప’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర చందనం అక్రమ రావాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. లాక్ డౌన్ అనంతరం మలి షెడ్యూల్‌కి సన్నద్ధమవుతోంది.
'పరుగు' కాంబినేషన్‌లో మరో చిత్రం?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ చిత్రాల జాబితాలో 'పరుగు'కి కూడా స్థానం ఉంది. 2008 వేసవిలో విడుదలైన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. తొలుత యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. క్రమంగా విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయింది.
మరోసారి అల్లు అర్జున్‌తో జట్టుకడుతున్న పూజా హెగ్డే?
‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో జంటగా నటించి అలరించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. దీంతో.. ఈ జోడీకి తెలుగునాట ఎనలేని క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్‌కి తగ్గట్టే త్వరలోనే బన్నీ, పూజ జోడీ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనుందని సమాచారం. అయితే, బన్నీ సినిమాలో ఈసారి నాయికగా కాకుండా.. ఓ ప్రత్యేక గీతం కోసం పూజ సందడి చేయనుందని టాలీవుడ్ టాక్.
"గీత గోవిందం " మూవీ వద్దు - అల్లు అర్జున్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "గీత గోవిందం" మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడిన ఈ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరింది. తన స్వంత బ్యానర్ లో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ లో అల్లు అర్జున్ ఎందుకు నటించలేదనే సందేహం అందరికీ వచ్చింది.
చిరు సినిమాలో బన్నీ.. అంతా తూచ్..!
మోహన్ లాల్ హీరో గా మలయాళంలో గత ఏడాది వచ్చిన 'లూసిఫర్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడో దక్కించుకున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా ఆయన ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అంతేకాదు ఈ సినిమాను సాహో డైరెక్టర్ సుజిత్ తో డైరెక్ట్ చేయించాలని చిరు కూడా ప్లాన్ లో వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనిలో సుజిత్ ఉన్నట్లు తెలుస్తుంది.
"పుష్ప "మూవీ సర్ ప్రైజింగ్ న్యూస్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"మూవీ రూపొందుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో చిత్తూరు యువకుడిగా అల్లు అర్జున్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న "పుష్ప" మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్?
మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ హక్కుల్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ రీమేక్ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా దర్శనమివ్వనున్నాడని సమాచారం.
అల్లు అర్జున్ 'నో' అన్నాడు... విజయ్ 'ఎస్' అన్నాడు..!
ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలను మరో హీరో ఓకే చేయడం అన్న సంగతి పాతతరం నుండి వస్తున్న ఆనవాయితీనే. ఒక్కోసారి అవి బోల్తా కొట్టొచ్చు.. ఒక్కోసారి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టొచ్చు. అలాంటి అంశాలను కూడా మనం చాలానే చూసాం. ఇక ఇప్పుడు ఈ టాపిక్ గురించి చర్చ ఎందుకంటే... ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న ఫైటర్ సినిమా కూడా మొదట విజయ్ ను అనుకోలేదట పూరీ జగన్నాథ్.
‘పుష్ప’లో కియారా అద్వానీ ప్రత్యేక గీతం ?
‘ఆర్య’, ‘ఆర్య2’ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఓ ప్రత్యేక గీతంలో మెరవనుందని సమాచారం.
90%సక్సెస్ రేట్ కలిగిన టాప్ స్టార్ అల్లు అర్జున్ అన్నది నిర్వివాదాంశం
అతను వారసత్వ హీరో అని చెప్పలేము. సాధారణంగా వారసత్వ హీరోలకు తమ తండ్రుల ద్వారా గొప్ప అభిమాన సంపద సంక్రమిస్తుంది. అయితే ఆయన తండ్రి, తాతలు సినీ ప్రముఖులే అయినప్పటికీ వారి పేరు ప్రఖ్యాతుల వల్ల ఇతని కెరీర్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే నేపథ్యమే తప్ప ఒక వారసత్వ హీరోను ఇంట్రడ్యూస్ చేయటానికి, నిలబెట్టటానికి అవసరమైనంత ప్రత్యేక ప్రయత్నాలు ఏవీ అతని విషయంలో జరగలేదు. అందుకే దశాబ్దాల చరిత్ర ఉన్న సినీ కుటుంబం నుండి వచ్చినప్పటికీ అతన్ని వారసత్వ హీరో అనలేము. వారసత్వ హీరో అయి ఉంటే హీరోగా తన మొదటి సినిమా " గంగోత్రి” లో అంత 'అండర్ డాగ్ ' క్యారెక్టర్ చేసేవాడు కాదు. భారీ తారాగణం, భారీ…