పేద రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయన వల్లే ఇలా ఉన్నాం..!

Stylish Star Allu Arjun Remembers His Grand Father Allu Ramalingaiah On His Death Anniversary

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ కూడా ఒకరు.. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకడు.. మరి ఈ రోజు వీరు ఈ పొజిషన్ లో ఉన్నారంటే దానికి ఆనాటి లెజెండ్రీ కమెడియన్ అల్లు రామలింగయ్య అని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు సినీ ఇండస్ట్రీలో అల్లు బ్రాండ్ అంత స్ట్రాంగ్ గా ఉండటానికి ఆయనే కారణం. ఎన్నో చిత్రాల్లో త‌న‌దైన హాస్యంతో ప్రేక్ష‌కుల మ‌దిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు రామలింగయ్య. ఆ రోజుల్లో వెండితెరపై అల్లు రామలింగయ్యను మించిన కమెడియన్ లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

ఇక ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన తాతను గుర్తు చేసుకున్నాడు. ‘తాత మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు గుర్తుంది. ఆయ‌న గొప్ప‌త‌న‌మేంటో ఈరోజు నాకు ఇంకా బాగా తెలుసు. జీవితంలో చాలా విషయాలు నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన కృషి, పట్టుదల, పోరాటాలకు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే మేమంతా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం’. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

 


కాగా 1922 అక్టోబర్ 1వ తేదీన పాలకొల్లులో జన్మించారు అల్లు రామలింగయ్య. 1953 లో ‘పుట్టిల్లు’ సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమైన రామలింగయ్య దాదాపు తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో పన్నెండు వందల సినిమాలలో నటించారు. ఆయన నటించిన చివరి సినిమా జై. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. 2004 జూలై 31న అల్లు రామలింగయ్య తుది శ్వాస విడిచారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here