ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలను మరో హీరో ఓకే చేయడం అన్న సంగతి పాతతరం నుండి వస్తున్న ఆనవాయితీనే. ఒక్కోసారి అవి బోల్తా కొట్టొచ్చు.. ఒక్కోసారి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టొచ్చు. అలాంటి అంశాలను కూడా మనం చాలానే చూసాం. ఇక ఇప్పుడు ఈ టాపిక్ గురించి చర్చ ఎందుకంటే… ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న ఫైటర్ సినిమా కూడా మొదట విజయ్ ను అనుకోలేదట పూరీ జగన్నాథ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ముంబై లో కొద్దిరోజులు షూటింగ్ ను జరుపుకోగా లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే అసలు ఫైటర్ కు విజయ్ ను అనుకోలేదట పూరీ. అల్లు అర్జున్ తో తీద్దామని అనుకున్నాడట. కానీ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసాడంట. ఆ తర్వాత ఇంకా కొన్ని మార్పులు చేసి.. విజయ్ కు చెప్పడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఇది ఎంత నిజమో తెలియదు కానీ న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతుంది. మరి ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే అల్లు అర్జున్ ఫీల్ అవుతాడేమో..
కాగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. కాగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: