బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా.. ఈ కాంబినేషన్ పై ఇప్పటినుండి కాదు గత కొద్దిరోజులుగా వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా ఫిక్స్ అయిందని… త్వరలో అప్ డేట్ కూడా ఇస్తారన్న వార్తలు వినిపించాయి. ఇక ఈ కాంబినేషన్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. అయితే ఇప్పుడు అనుమానాలన్నిటికి బ్రేక్ వేసి అధికారిక ప్రకటన ఇచ్చేసారు. బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారు. నా తర్వాత సినిమా స్టయిలిష్ స్టార్ బన్నీ చేస్తున్నాను అంటూ ఒక పోస్టర్ ను కూడా పోస్ట్ చేశారు. యువ సుధ ఆర్ట్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శాండీ, స్వాతి, నట్టి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2022 ప్రథమార్థంలో సినిమాను విడుదల చేస్తామని కూడా తెలిపారు.
Glad to announce my next with stylish star @alluarjun, produced by my dearest friend sudhakar mikkilineni @Yuvasudhaarts in association with @GA2Official pic.twitter.com/oKciwiSYgB
— koratala siva (@sivakoratala) July 31, 2020
ప్రస్తుతం సుకుమార్ తో అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అయి రిలీజ్ అవ్వాలంటే 2021 సగం ఏడాది అయిపోతుంది. మరోపక్క కొరటాల శివ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక వీరిద్దరూ తమ ఆ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ తన 21వ సినిమాను ప్రారంభిస్తారు. 2021 ద్వితీయార్థంలో సినిమా షూటింగ్ మొదలు పెట్టి 2022 లో సినిమా రిలీజ్ చేయనున్నారు. మరి బన్నీ-కొరటాల కాంబినేషన్ అంటే వినడానికే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి బన్నీకి ఎలాంటి కథను సిద్ధం చేశాడో కొరటాల చూద్దాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: