అల్లు అర్జున్ , ఎన్టీఆర్ డ్యాన్స్ లు ఇష్టం – ప్రణీత సుభాష్

I Enjoy Watching Dances Moves of Junior NTR and Allu Arjun Says Tollywood Actress Pranitha Subhash

తెలుగు , తమిళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్ ప్రస్తుతం “రామన అవతార “కన్నడ మూవీ లో నటిస్తున్నారు. “భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ” మూవీ తో ప్రణీత బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. మరో హిందీ మూవీ “హంగామా 2” లో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బాధితులకు తనవంతు సాయం అందజేశారు. ఆదివారం (5వ తేదీ ) ప్రణీత ట్విట్టర్ లో తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి నివారణకు జరుగుతున్న పోరాటంలో ప్రతీ ఒక్కరూ అవిశ్రాంతంగా పోరాడాలని , ఆ ఆలోచన తోనే స్వీయ స్ఫూర్తి తో లాక్ డౌన్ లో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నానని , మార్పు కు తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకోవడం నేర్చుకున్నానని, తన కుటుంబ సభ్యులు తనను డాక్టర్ గా చూడాలనుకున్నారని , కానీ తాను యాక్టర్ గా మారానని , తన విజయాల పట్ల కుటుంబం గర్వపడుతుందని , వైరస్ అంతం అయిన తరువాత తనకు ఇష్టమైన ప్రదేశాలకు వెళతానని , కాల చక్రంలో తనకు వెనక్కు వెళ్ళే అవకాశం వస్తే చైనీయులను శాకాహారులుగా మారుస్తానని , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ డ్యాన్స్ లు ఇష్టమని , రొమాంటిక్ కామెడీ మూవీస్ లైక్ చేస్తానని , బ్లాక్ బస్టర్ “అత్తారింటికి దారేది ” మూవీ లో భారత నాట్య సన్నివేశం తన సినీ కెరీర్ లోనే అత్యంత ఇష్టమైనదని ప్రణీత చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.